ప్రతిపక్ష నేతను కలవొద్దని విదేశీ అతిథులకు ప్రభుత్వమే చెబుతోంది: రాహుల్ గాంధీ
భారత్లో రెండు రోజుల పర్యటనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విదేశీ అతిథులను లోక్సభలో ప్రతిపక్ష నేత (లీడర్ ఆఫ్ ఆపోజిషన్ - ఎల్ఓపి)ను కలవొద్దని ప్రభుత్వమే సూచిస్తోందని, ఇది దాని ‘అభద్రతా భావం’ను చూపిస్తోందని ఆయన ఆరోపించారు.
