Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
నాంపల్లి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డి

నాంపల్లి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డి

Gaddamidi Naveen
6 మార్చి, 2026

చారిత్రక హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తయితే, అది నగరానికే మరో రత్నంగా మారుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.327 కోట్ల వ్యయంతో ఈ పునర్నిర్మాణ పనులను చేపట్టింది. ఈ పనులను 2027 చివరి నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటి నుంచి పనులు పూర్తి అయ్యే వరకు రోజులు లెక్కించడం ప్రారంభమైంది. నేను స్వయంగా ఇక్కడికి వచ్చి పరిశీలించినందున పనులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు.

హైదరాబాద్ నగర వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ స్టేషన్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా స్టేషన్‌లో పెద్ద సెంట్రల్ హాల్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో రెస్టారెంట్లు, వివిధ స్టాల్స్‌తో పాటు ప్రయాణికులకు అవసరమైన మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా వై-ఫై సదుపాయం, సీసీటీవీ నిఘా వ్యవస్థ, ఆధునిక భద్రతా ఏర్పాట్లు వంటి సదుపాయాలు కల్పించనున్నారు.

ఇదిలా ఉండగా, 2026–27 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.5,450 కోట్లను కేటాయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.48,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు. ఈ పునర్నిర్మాణ పనులు పూర్తయిన తరువాత నాంపల్లి రైల్వే స్టేషన్ ఆధునిక సదుపాయాలతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన కేంద్రంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

నాంపల్లి రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు పరిశీలించిన కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డి - Tholi Paluku