Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత.. త్వరలో రాజకీయ పార్టీ!

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత.. త్వరలో రాజకీయ పార్టీ!

Gaddamidi Naveen
6 మార్చి, 2026

తెలంగాణ రాజకీయాల్లో మరో పెనుమార్పుకు తెరలేవనుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో తెలంగాణ ప్రజల కోసం కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కోర్టు ఆమెను నిర్దోషిగా విడుదల చేసిన (డిశ్చార్జ్) నేపథ్యంలో, శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్వామివారి ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి తిరుమలకు వచ్చిన కవిత, మీడియాతో మాట్లాడుతూ.. భగవంతుడి ఆశీస్సులతో త్వరలోనే తెలంగాణ ప్రజల కోసం ఒక కొత్త ప్రాంతీయ పార్టీని తీసుకురాబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల ద్వారా మమ్మల్ని ఎలా వేధించిందో, రాజకీయ కక్ష సాధింపులకు ఎలా పాల్పడిందో దేశమంతా చూసింది. ఈ పోరాటంలో దేశంలోని మహిళలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు నాకు అండగా ఉంటారని నమ్ముతున్నాను అని పేర్కొన్నారు.

గత నాలుగేళ్లుగా తాను ఎదుర్కొంటున్న మనోవేదనకు స్వామివారి కృపతో ముగింపు లభించిందని కవిత తెలిపారు. సత్యం, న్యాయం, ధర్మం తమవైపే ఉన్నాయని తాను ఎప్పటి నుంచో చెబుతూ వచ్చానని అన్నారు. స్వామివారి ఆశీర్వాదంతో తాను ఎదుర్కొన్న కేసులో పూర్తిగా క్లీన్ చిట్ రావడంతో, కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కు చెల్లించుకున్నానని ఆమె వెల్లడించారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరిపాలన పరంగా విడిపోయినా ప్రజల మధ్య స్నేహభావం కొనసాగాలని తాను ప్రార్థించినట్లు కవిత పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత.. త్వరలో రాజకీయ పార్టీ! - Tholi Paluku