Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
నేడు 'ధురందర్ 2' ట్రైలర్

నేడు 'ధురందర్ 2' ట్రైలర్

Gaddamidi Naveen
6 మార్చి, 2026

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు సృష్టించిన 'ధురందర్' చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న 'ధురందర్: ది రివెంజ్' (ధురందర్ 2) కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకి ఆ ఎదురుచూపులకు తెరదించుతూ, చిత్ర బృందం ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను నేడు ఉదయం 11:01 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న స్టార్ హీరో రణవీర్ సింగ్, సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను పంచుకుంటూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. నేడు ఉదయం 11:01 గంటలకు ట్రైలర్ రాబోతోంది.. సిద్ధంగా ఉండండి. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుందని ఆయన పేర్కొన్నారు. ఈ అప్‌డేట్‌తో అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తుందని నెటిజన్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

రికార్డుల రారాజు 'ధురందర్'

గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన 'ధురందర్' మొదటి భాగం, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా, అంతకుముందు ఉన్న 'పుష్ప 2: ది రూల్' రికార్డులను సైతం అధిగమించి, బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్‌గా అవతరించింది. కేవలం వసూళ్లే కాకుండా, ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు పొందింది.

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రెండో భాగంలో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. మొదటి భాగంలో పాకిస్థానీ గ్యాంగ్‌స్టర్ రెహమాన్ డకైత్ పాత్రలో అక్షయ్ ఖన్నా పోషించిన నెగటివ్ షేడ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 19, 2026న ఉగాది, గుడి పడ్వా , ఈద్ పండుగల సందర్భంగా ఉండటం వల్ల బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ట్రైలర్ విడుదలతో సినిమా పై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశముంది. అభిమానులు ఇప్పుడు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నేడు 'ధురందర్ 2' ట్రైలర్ - Tholi Paluku