Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
జాతీయ షూటింగ్ ట్రయల్స్: భవేష్ షెకావత్ ముందంజ

జాతీయ షూటింగ్ ట్రయల్స్: భవేష్ షెకావత్ ముందంజ

Shaik Mohammad Shaffee
6 మార్చి, 2026

స్థానిక డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరుగుతున్న జాతీయ ఎంపిక ట్రయల్స్ (టీ3)లో రాజస్థాన్ షూటర్ భవేష్ షెకావత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగం తొలి దశ (స్టేజ్-1) ముగిసే సమయానికి భవేష్ అగ్రస్థానంలో నిలిచాడు. మూడు సిరీస్‌లలో వరుసగా 99, 99, 96 పాయింట్లతో మొత్తంగా 294-11x స్కోరు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.

గట్టి పోటీనిస్తున్న అనీష్, రాజ్‌కన్వర్

ఒలింపియన్ అనీష్ భన్వాలా కూడా నిలకడైన ప్రదర్శనతో భవేష్‌కు గట్టి పోటీనిస్తున్నాడు. అనీష్ 291-11x (97, 98, 96) స్కోరుతో రెండో స్థానంలో నిలవగా, రాజ్‌కన్వర్ సింగ్ సంధు కూడా అదే 291 (96, 98, 97) స్కోరుతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుత జాతీయ ఛాంపియన్ సూరజ్ శర్మ 290-9x (98, 95, 97) పాయింట్లతో వీరి వెంటే నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇతర షూటర్ల ప్రదర్శన ఇలా..

ఈ విభాగంలో పాల్గొన్న ఇతర కీలక షూటర్లలో అంకుర్ గోయల్ 289-12x, ముఖేష్ నెలవల్లి 289-7, విజయ్‌వీర్ సిద్ధూ 289-6x, ఆదర్శ్ సింగ్ 289-4x స్కోర్లతో ముందంజలో ఉన్నారు. ప్రదీప్ సింగ్ (286-9x), ఓంకార్ సింగ్ (286-6x), ఉదయ్‌వీర్ సిద్ధూ (284-7x), నీరజ్ కుమార్ (284-6x), మన్దీప్ సింగ్ (281-7x) తమ వంతు ప్రయత్నం చేశారు.

నేడే ఫైనల్స్

ఈ టోర్నీలో భాగంగా శనివారం 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ రెండో దశతో పాటు ఫైనల్స్ జరగనున్నాయి. అదేవిధంగా శనివారం నుంచే 10 మీటర్ల రైఫిల్ షూటర్లు బరిలోకి దిగనున్నారు. ఈ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్లతో పాటు ఫైనల్స్ కూడా నేడే నిర్వహించనున్నారు.

జాతీయ షూటింగ్ ట్రయల్స్: భవేష్ షెకావత్ ముందంజ - Tholi Paluku