Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
హీరో ఆది ‘శంబాల’ విడుదల డేట్ ఫిక్స్

హీరో ఆది ‘శంబాల’ విడుదల డేట్ ఫిక్స్

Thaduri Lalitya
20 అక్టోబర్, 2025

యువ కథానాయకుడు ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసి, దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. యుగంధర్ ముని దర్శకత్వంలో ‘షైనింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సూపర్‌న్యాచురల్ థ్రిల్లర్, భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ కీలక పాత్రల్లో నటించారు.

ఇప్పటివరకు విడుదలైన టీజర్, గ్లింప్స్, మేకింగ్ వీడియోలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ట్రేడ్ వర్గాల్లో ‘శంబాల’కు గట్టి డిమాండ్ నెలకొంది, అభిమానుల్లోనూ సానుకూల స్పందన కనిపిస్తోంది. విడుదల తేదీ పోస్టర్‌లో ఆది లుక్, కుక్క, పొగతో ఏర్పడిన ఆకారం సినిమాపై ఉత్కంఠను మరింతగా పెంచాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. క్రిస్మస్ సెలవుల్లో బాక్సాఫీస్‌లో ఈ చిత్రం గట్టి పోటీ ఇవ్వనుంది. ‘కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే ఈ మూవీ అద్భుత అనుభవాన్ని అందిస్తుంది’ అంటూ నిర్మాతలు తెలిపారు.

హీరో ఆది ‘శంబాల’ విడుదల డేట్ ఫిక్స్ - Tholi Paluku