Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ తనిఖీలు

Gaddamidi Naveen
20 అక్టోబర్, 2025

దీపావళి పండుగ సందర్భంగా, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రత్యేక తనిఖీ చర్యలు చేపట్టింది. ఈ తనిఖీలు ప్రధానంగా స్వీట్లు తయారుచేసే యూనిట్లు, రీటైలర్లపై అధికారులు చేపట్టారు. ప్రజలకు సురక్షిత‌మైన‌ ఆహారం అందించడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. తనిఖీలలో కృత్రిమ రంగులు, నాన్-ఫుడ్ గ్రేడ్ ఆయిల్స్, కలుషిత నెయ్యి, పునర్వినియోగం చేసిన వంట నూనెలు ఉపయోగిస్తున్న యూనిట్లు గుర్తించబడ్డాయని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎక్స్ ( ట్విట్ట‌ర్)లో పేర్కొన్నారు, 33 జిల్లాల్లో పండ‌గ సంద‌ర్భంలో భాగంగా ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ డ్రైవ్‌లు నిర్వహించబడ్డాయి. మొత్తం 95 స్వీట్స్ యూనిట్లను తనిఖీ చేశామన్నారు. అందులో 77 ఎన్‌ఫోర్స్‌మెంట్ నమూనాల 157 సర్వైలెన్స్ నమూనాలను ల్యాబ్‌లో విశ్లేషణ కోసం పంపించ‌మ‌ని అధికారులు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలను హెచ్చరిస్తూ పండుగలో కలుషిత ఆహారం కొనుగోలు చేయవద్దని. అలాగే, ఉత్పత్తిదారులు నాణ్యత ప్రమాణాలను పాటించడం అత్యంత అవసరమని తెలిపారు. ఈ సేఫ్టీ డ్రైవ్‌ ద్వారా సురక్షిత‌మైన‌, నాణ్యత గల ఆహారం వినియోగదారులకు అందించడంలో ప్రభుత్వం ముందడుగు వేస్తోందని అధికారులు పేర్కొన్నారు.

స్వీట్ షాపులపై ఫుడ్ సేఫ్టీ తనిఖీలు - Tholi Paluku