Let's talk: editor@tmv.in
స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Gaddamidi Naveen
19 అక్టోబర్, 2026

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయబోతోందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే అభ్యర్థుల విజయానికి ప్రధాన బలమని ఆమె పేర్కొన్నారు.

ఆదివారం గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఎన్డీయే కూటమి బలపరిచిన పలువురు డివిజన్ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. 27వ డివిజన్ అభ్యర్థి ఉల్లి గోపాల్ కృష్ణ, 34వ డివిజన్ అభ్యర్థి గాలం వెంకటేశ్వర్లు, 31వ డివిజన్ అభ్యర్థి గంటా మౌళిక, 48వ డివిజన్ అభ్యర్థి మానం శ్రీనివాస్ నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొని వారికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ, ప్రజల ఆదరణతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని అన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.

స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది: ఎమ్మెల్యే గళ్ళా మాధవి - Tholi Paluku