Let's talk: editor@tmv.in
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం.. నేను బాధ్యురాలిని కాదు: కొండా సురేఖ
సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం.. నేను బాధ్యురాలిని కాదు: కొండా సురేఖ

సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం.. నేను బాధ్యురాలిని కాదు: కొండా సురేఖ

Gaddamidi Naveen
21 ఆగస్టు, 2026

టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ (డీఏసీ) జారీ చేసిన షోకాజ్ నోటీసులపై రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ ఇచ్చిన నోటీసులపై ఆమె డీఏసీ ఛైర్మన్ డాక్టర్ మల్లు రవికి సుదీర్ఘమైన లేఖ రాశారు.

ఈ సందర్భంగా తన జన్మదిన వేడుకల్లో కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి కోరారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటితో తనకు ఎలాంటి ప్రమేయం లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం ఉన్నంత మాత్రాన మరొకరి రాజకీయ వ్యాఖ్యలకు తానూ బాధ్యత వహించాలనడం, దానికి తనను వివరణ కోరడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని, ఈ వివాదంలో తన ప్రమేయం లేదనే విషయాన్ని పార్టీ నాయకత్వం గుర్తించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తన ప్రమేయం లేని అంశంలో తనకు నోటీసులు ఇవ్వడం తగదని, ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని ఆమె టీపీసీసీ క్రమశిక్షణా కమిటీని కోరారు.

సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం.. నేను బాధ్యురాలిని కాదు: కొండా సురేఖ - Tholi Paluku