Let's talk: editor@tmv.in
రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ విడుదల

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ విడుదల

Gaddamidi Naveen
13 ఆగస్టు, 2026

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'ఇరుముడి' ట్రైలర్ విడుదలవుతూనే సినీ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన, ఆకట్టుకునే నటనతో అలరించనున్నారు. ‘ఇరుముడి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల వేడుక భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ సినిమా తన కుటుంబాన్ని కాపాడేందుకు ఓ వ్యక్తి విశ్వాసాన్నే తన అతిపెద్ద ఆయుధంగా మార్చుకుని చేసే ప్రయాణమే అనే శక్తివంతమైన కాన్సెప్ట్‌తో కట్ చేసిన ట్రైలర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌కు సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ ఆల్కహాల్ వ్యసనం ఉన్న ఒక సగటు తండ్రి పాత్రలో కనిపించనున్నారు. తన కూతురి భవిష్యత్తు కోసం, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం 41 రోజుల పాటు కఠినమైన అయ్యప్ప స్వామి మాల ధరించి తన జీవితాన్ని మార్చుకునే పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ రోల్‌లో ఆయన అలరించనున్నారు. ట్రైలర్‌లో కనిపించిన తండ్రీ-కూతుళ్ల అనుబంధం, ఎమోషనల్ సన్నివేశాలు, డైలాగులు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి.

రవితేజ నటనా విశ్వరూపం, శివ నిర్వాణ భావోద్వేగాల మార్క్, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం మేళవింపుగా వస్తున్న ఈ చిత్రం ద్వారా మాస్ మహారాజా గట్టి కంబ్యాక్ ఇవ్వడం పక్కా అని సినీ ప్రియులు భావిస్తున్నారు. ఈ భక్తి, భావోద్వేగాల చిత్రం ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ విడుదల - Tholi Paluku