Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
బీసీ బంద్‌కు మద్దతిచ్చినట్టు కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు: కేటీఆర్

బీసీ బంద్‌కు మద్దతిచ్చినట్టు కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు: కేటీఆర్

Gaddamidi Naveen
20 అక్టోబర్, 2025

బీసీ రిజర్వేషన్ల విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీసీ బంద్‌కు మద్దతిచ్చినట్టు నాటకాలు ఆడాయని విమర్శించారు. కానీ ఢిల్లీలో జరిగిన కీలక చర్చల్లో బీసీ వర్గాలను మోసం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో బీసీ కోటా, రిజర్వేషన్ల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోందని, బీసీ వర్గాల సమస్యలపై ప్రభుత్వాలపై నిరంతర పోరాటం చేస్తామ‌ని తెలిపారు. బీసీ వ‌ర్గాల వారి హక్కులను రక్షించేందుకు బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. బీసీ బంద్‌‌కు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మద్దతిచ్చినట్లు నాటకాలు ఆడుతున్నాయని, బీసీ రిజర్వేషన్ల అమలు చేయవలసిన బాధ్యత మీపై లేదా? అని ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయలని కేటీఆర్ సూచించారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే రాజకీయ యాత్రను జూబ్లీహిల్స్ ప్రాంతం నుండి ప్రారంభించాలని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీని మరింత బలపరచడానికి ఈ యాత్ర చేపట్టాలని ఆయన తెలిపారు.

ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాలలో ప్రధాన చర్చగా మారాయి. బీసీ వర్గాల మద్దతు కోసం కేటీఆర్ పర్యటన, జూబ్లీహిల్స్ నుండి ప్రారంభమవడం, తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకలాపాలను మరింత ఉత్సాహభరితంగా మార్చే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ వివాదానికి ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న బీసీ కోటా 42 శాతం ఆర్డర్‌పై సుప్రీంకోర్టు, హైకోర్టు నిర్ణయాలు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ వర్గాల సంక్షేమం కోసం ఈ కోటాను అమలు చేయాలని ప్రయత్నించినప్పటికీ, కేంద్రం ద్వారా తగిన అంగీకారం పొందడం ఇంకా సాధ్యంకాలేదు.

బీసీ బంద్‌కు మద్దతిచ్చినట్టు కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు: కేటీఆర్ - Tholi Paluku