
ఫ్లోటింగ్ సోలార్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులకు కేంద్రం కొత్త పథకం
జలాశయాలపై తేలియాడే (ఫ్లోటింగ్) సోలార్ ప్లాంట్లు, వాటితో పాటు బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏర్పాటు చేయడానికి కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కొత్త పథకాన్ని రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.7,000, 8,000 కోట్లు వ్యయ సాధ్యత నిధి ఆమోదం కోసం ఆర్థిక మంత్రిత్వశాఖను సంప్రదించినట్లు ఎమ్ఎన్ఆర్ఇ కార్యదర్శి సంతోష్ కుమార్ సారంగి తెలిపారు.
సిఐఐ నిర్వహించిన ఇండియా ఎడ్జ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, “ఫ్లోటింగ్ సోలార్‌తో బ్యాటరీ స్టోరేజ్‌కు సంబంధించిన కొత్త పథకం తీసుకురావడం కోసం ఎమ్ఎన్ఆర్ఐ పనిచేస్తోంది. దీని కోసం రూ.7, 8 వేల కోట్ల విజిఎఫ్ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరాం. సుమారు 300 జిడబ్ల్యూ సామర్థ్యం ఉన్న జలాశయాలపై ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయబడతాయి.”అని అన్నారు.
2030 నాటికి సి&ఐ రంగం నుంచి 60- 80 జిడబ్ల్యూ పునరుత్పాదక ఇంధనం
గురువారం జరిగిన మరో సెషన్‌లో సంతోష్ మాట్లాడుతూ, 2030 నాటికి కమర్షియల్ & ఇండస్ట్రియల్ డెవలపర్ల నుంచే 60 - 80 జిడబ్ల్యూ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. “సి&ఐ ఇన్‌స్టాలేషన్‌ల ద్వారా పునరుత్పాదక ఇంధనం వేగంగా పెరుగుతోంది. 2030 నాటికి 60 - 80 జిడబ్ల్యూ వరకు ఈ రంగం నుంచే అందుతుంది” అని ఆయన అన్నారు.
రూఫ్‌టాప్ సోలార్ కూడా దేశంలోని పలు ప్రాంతాల్లో వేగంగా పెరిగుతోందని, ఈ ధోరణి రాబోయే సంవత్సరాల్లో మరింత బలపడుతుందని చెప్పారు. మధ్యప్రదేశ్, గుజరాత్ ముందంజలో పునరుత్పాదక ఇంధన రంగంలో మధ్యప్రదేశ్ “ముఖ్యమైన, ప్రగతిశీల రాష్ట్రం” అని ఆయన వివరించారు. ప్రతి రాష్ట్రం తమ అవసరాలకు అనుగుణంగా టెండర్లు విడుదల చేస్తుండటంతో ఒక స్పష్టమైన నమూనా రూపుదిద్దుకుంటోందని చెప్పారు.
విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున, ఆర్ ఇ వృద్ధి మరింత వేగం
భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ భారీగా పెరగనున్నందున, పునరుత్పాదక ఇంధన అవసరం కూడా గణనీయంగా పెరుగుతుందని సంతోష్ పేర్కొన్నారు. రాష్ట్రాలు మరిన్ని టెండర్లు ఇస్తున్న కొద్దీ, ఈ మార్పుకు రాష్ట్రాల పాత్ర మరింత కీలకమవుతుందని తెలిపారు.
గ్రిడ్ ఇంటిగ్రేషన్, స్టోరేజ్ సమస్యలు ఇంకా సవాలు
పునరుత్పాదక ఇంధనాన్ని జాతీయ గ్రిడ్‌లో సమన్వయం చేయడంలో కొన్ని సవాళ్లు ఉన్నాయని, వాటిని తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌లో బ్యాటరీ సిస్టమ్స్ ఏర్పాటు చేయడం, స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచడం అత్యవసరమని చెప్పారు. ఎనర్జీ సెక్యూరిటీ కోసం సప్లై చైన్ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకోసం పిఎల్ఐ స్కీమ్ ప్రయోజనాలు భారత కంపెనీలు సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. భారతదేశ సోలార్ మోడ్యూల్ తయారీ సామర్థ్యం ఇప్పటికే దాదాపు 140 జిడబ్ల్యూ చేరిందని వెల్లడించారు.
గ్రీన్ హైడ్రోజన్ పోర్టుల్లో కొత్త సౌకర్యాలు
గ్రే అమోనియా ధర 450 యూఎస్డీ నుండి 550 యూఎస్డీ కి పెరగడం, రూపాయి విలువ తగ్గడం వల్ల జరిగిందని చెప్పారు. అలాగే, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ నిధులను ఉపయోగించి అనేక పోర్టుల్లో బంకరింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.
విద్యుత్ రంగ సంస్థలతో సమన్వయం
ఎమ్ఎన్ఆర్ఇ,సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, పవర్ మంత్రిత్వ శాఖ రెగ్యులేటర్‌తో సమన్వయంగా పనిచేస్తోందని చెప్పారు. సౌర, వాయు ఇతర రంగ ప్రతినిధులతో నెలకొకసారి సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తున్నామని వివరించారు.
