Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ప్రాణం తీసిన వ్యక్తిగత వివాదం

ప్రాణం తీసిన వ్యక్తిగత వివాదం

Panthagani Anusha
20 అక్టోబర్, 2025

కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో ఆదివారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. మంజేరి సమీపంలోని చారంకావు ప్రాంతంలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో 35 ఏళ్ల యువకుడిని పచ్చిక కోసే యంత్రంతో దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘోరం జరిగిన కొద్ది సమయంలోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

బస్‌స్టాప్ వద్ద దాడి

మృతుడిని వండూరు ప్రాంతంలోని చాత్తన్‌గోట్టుపురంకు చెందిన కుంజిలక్ష్మి కుమారుడు ప్రావీణ్‌గా పోలీసులు గుర్తించారు. కాగా నిందితుడు చారంకావు నివాసి మొయిదీన్‌కుట్టి. ఈ హత్య ఉదయం 6:45 గంటల సమయంలో చారంకావు బస్‌స్టాప్ వద్ద జరిగింది. ప్రత్యేక్ష సాక్షుల కథనం ప్రకారం ప్రావీణ్ తన మోటార్‌సైకిల్‌పై బస్‌స్టాప్‌కు చేరుకున్న వెంటనే మొయిదీన్‌కుట్టి అతడిని అడ్డుకుని, పాలన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న గడ్డి కోసే కత్తెరతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారైయ్యాడు.

మరోవైపు ఈ దాడితో తల, మెడ, ముఖంపై తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రవీణ్ ని హుటాహుటిన కి స్థానిక ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ చేసిన అతని అతడు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు అని పేర్కొన్నారు. ఇక స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న మంజేరి పోలీసులు నిందితుడు మొయిదీన్‌కుట్టిని ఘటన జరిగిన కొద్దీ సమయంలోనే అరెస్టు చేశారు. అనంతరం అతడిపై సెక్షన్ 302 హత్య నేరం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఇక పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో భాగంగా వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు మొయిదీన్‌కుట్టి తన నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. అంతేకాక ప్రావీణ్‌తో ఉన్న వ్యక్తిగత వివాదాల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపాడు. అయితే, హత్యకు దారితీసిన కచ్చితమైన కారణాలు, నేపథ్యాన్ని తెలుసుకోవడానికి పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తయిన అనంతరం ప్రావీణ్ బంధువులకు అప్పగిస్తామని, ఇక అరెస్టయిన మొయిదీన్‌కుట్టిని త్వరలోనే స్థానిక కోర్టులో హాజరుపరచి అతనికి కఠినమైన శిక్ష పడేలా చేస్తామని ప్రవీణ్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు పోలీసు అధికారులు

ప్రాణం తీసిన వ్యక్తిగత వివాదం - Tholi Paluku