Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
పారిస్‌ మ్యూజియంలో చోరీ: నెపోలియన్ నాటి వస్తువుల అపహరణ

పారిస్‌ మ్యూజియంలో చోరీ: నెపోలియన్ నాటి వస్తువుల అపహరణ

Pinjari Chand
20 అక్టోబర్, 2025

ఫ్రాన్స్‌లోని ప్రసిద్ధ లూవ్రే మ్యూజియంలో ఆదివారం ఉదయం భారీ దొంగతనం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఫ్రాన్స్ 24 రిపోర్ట్ చేసింది. ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి రచిదా డాటి తన ఎక్స్ ఖాతా లో ఈ ఘటనను ధృవీకరించారు. లూవ్రే మ్యూజియంలో ఆదివారం ఉదయం భారీ చోరి జరిగింది అని ఆమె తెలిపారు.పోలీసుల సమాచారం ప్రకారం దొంగలు ఉదయం 9:30 నుంచి 9:40 మధ్య స్కూటర్ పై వచ్చి, చిన్న చైన్‌ లతో రంధ్రాలు వేసి రత్నాలను కదిలించారు. ఒక సరుకుల లిఫ్ట్ను ఉపయోగించి వారు అభరణాలు ఉన్న గదికి చేరుకున్నారు.

లూవ్రే మ్యూజియం గతంలో లూయిస్–14 వరకు ఫ్రాన్స్ రాజుల నివాసంగా ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఎక్కువగా సందర్శించే మ్యూజియాలలో ఒకటిగా ఉంది. గత సంవత్సరం ఈ మ్యూజియాన్ని తొమ్మిది మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు.

లూవ్రే అధికారులు ఎక్స్ ఖాతా లో ఒక ప్రకటనలో అసాధారణ కారణాల వల్ల మ్యూజియం ఈ రోజు మూతపడిందని తెలిపారు. లే పారిసియన్ పత్రికా తెలిపిన వివరాల ప్రకారం దొంగలు సేన్ నది వైపు ఉన్న ఫసేడ్ నుంచి ప్రవేశించారని, అపోలో గ్యాలరీలోని అభరణాలు ఉన్న గదికి నేరుగా చేరడానికి సరుకుల లిఫ్ట్‌ను ఉపయోగించారు. వారు కిటికీలను పగులగొట్టి, నెపోలియన్, రాణికి సంబంధించి తొమ్మిది విలువైన రత్నాలను దోచుకెళ్లారు. మ్యూజియం సిబ్బంది , పోలీసుల సమక్షంలో మంత్రి మాట్లాడుతూ ఎవరికీ గాయాలు కాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

పారిస్‌ మ్యూజియంలో చోరీ: నెపోలియన్ నాటి వస్తువుల అపహరణ - Tholi Paluku