Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
దేశ ఆర్థిక పరిస్థితిని రూపాయి విలువ చూపిస్తోంది: ఖర్గే

దేశ ఆర్థిక పరిస్థితిని రూపాయి విలువ చూపిస్తోంది: ఖర్గే

Pinjari Chand
4 డిసెంబర్, 2025

అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ 90 దాటిపోవడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వంపై రూపాయి విలువ పడిపోతుందని ప్రశ్నించిన మోడీని ఖర్గే గుర్తు చేశారు. గురువారం రూపాయి 28 పైసలు కోల్పోయి డాలర్‌తో 90.43కి చేరి కొత్త చారిత్రక కనిష్టానికి పడిపోయింది.ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఖర్గే ఇలా అన్నారు

ఇవాళ రూపాయి 90 దాటేసింది. ప్రభుత్వం ఎంత డప్పు కొట్టినా, రూపాయి విలువ పడిపోవడమే దేశ నిజమైన ఆర్థిక పరిస్థితిని చూపిస్తోంది. మోడీ ప్రభుత్వ విధానాలు సరైనవైతే రూపాయి ఇలా పడిపోయేది కాదు. 2014కి ముందు మోడీజీ భారత రూపాయి ఎందుకు పత్లా (విలువ తగ్గుతుంది) అవుతోంది, దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దేశం మీ నుంచి సమాధానం కోరుతోంది అని. ఇవాళ మేం మోడీజీని అదే ప్రశ్న అడుగుతున్నాం. ఆయన సమాధానం చెప్పాల్సిందే అని ఖర్గే రాసుకొచ్చారు.

అంతకుముందు పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఖర్గే, రూపాయి విలువ పడిపోతుండటం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని స్పష్టమవుతోందని అన్నారు. వీళ్లు ఎప్పుడూ అభివృద్ధి చెందుతున్నామనీ, ఆర్థిక పరిస్థితి బాగుందనీ చెబుతూ ఉంటారు. కానీ రూపాయి విలువ పడిపోతుంటేనే నిజమైన ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలుస్తోంది అని ఆయన విమర్శించారు. ఫారెక్స్ వ్యాపారులు చెప్పిన ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ జోక్యం తక్కువగా ఉండటం, దిగుమతిదారుల నుంచి భారీగా డాలర్ డిమాండ్ ఉండటం వల్ల రూపాయిపై నిరంతరం ఒత్తిడి పడుతోంది.

ఇప్పుడు వీళ్ల సమాధానం ఏమిటి? ప్రియాంక

అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ 90 మార్కును దాటిపోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం బీజేపీపై విరుచుకుపడ్డారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో డాలర్ ధర పెరిగినప్పుడు బీజేపీ నేతలు ఏమి అన్నారో గుర్తు చేస్తూ, ఇప్పుడు వీళ్ల సమాధానం ఏమిటని ప్రశ్నించారు. గురువారం రూపాయి విలువ 89.89 వద్ద ముగిసింది.

దేశ ఆర్థిక పరిస్థితిని రూపాయి విలువ చూపిస్తోంది: ఖర్గే - Tholi Paluku