
దీపోత్సవానికి ఆహ్వానం అందలేదు: ఎంపీ అవధేశ్ ప్రసాద్
అయోధ్యలో జరుగుతున్న దీపోత్సవానికి ఆహ్వానం అందకపోవడంపై సమాజ్ వాది పార్టీకి చెందిన ఎంపీ అవధేశ్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన గెలిచిన ఫైజాబాద్ నియోజకవర్గంలోనే అయోధ్య ఉంటుంది. తమ పార్టీ ఈ కార్యక్రమానికి వ్యతిరేకం కానప్పటికీ తమకు పిలుపు అందలేదని వాపోయారు. ఇది బీజేపీ మనస్తత్వాన్ని, భావజాలాన్ని తెలియజేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ నిధులతో ఈ ఆదివారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా తనను ఈ కార్యక్రమంలో పాల్గోనాలని ప్రభుత్వం ఆహ్వానించలేదన్నారు. గత సంవత్సరం కూడా ఇలాగే జరిగిందన్నారు. తనకు తెలిసిన వారు ఈ కార్యక్రమానికి వెళుతున్నారా?అని అడుగుతున్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం లేనిదే ఏ విధంగా వెళ్లాలి అని వాపోయారు.
మేం దీపోత్సవానికి వ్యతిరేకం కాదు. నిజానికి మేం దాన్ని స్వాగతిస్తున్నాం. నూనె లో సగం దీపాల కోసం వాడతారు, మిగతా సగం అమ్మేస్తారు. ప్రజల ఇళ్లలో నిజమైన వెలుగును, అవగాహనను తీసుకురావడం, అజ్ఞానపు చీకట్లను పారదోలే విధంగా వ్యవస్థ ఉండాలని ప్రసాద్ కాంక్షించారు.
ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ప్రసాద్ మద్దతు తెలిపారు. ఆయన ఆయోధ్యకు వెళ్లి నిధులు ఎలా వృథా అవుతున్నాయో చూడాలి. ప్రజల గుండెల్లో ఆనందం, ఆదాయం పెంపు, నిరుద్యోగం నిర్మూలన, సమగ్ర అభివృద్ధి కలిగే విధంగా వ్యవస్థ ఉండాలి అని అఖిలేష్ చెప్పారు. అలాగే 2027 ఎన్నికల్లో ఎస్పీ సర్కార్ వస్తుందని, ప్రజల కష్టాలు తీరుస్తామన్నారు. యోగి ప్రభుత్వం రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఎంపీ ఆరోపించారు.
సరయూ తీరంలో వెలగనున్న 26 లక్షల దీపాలు
సరయూ నది ఒడ్డున ఈ సారి 26 లక్షల దీపాలను వెలిగిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలుపుతున్నారు. 2025 లో నది తీర ప్రాంతంలో రామ్ కీ ఫైడీ దగ్గర అత్యధిక దీపాలను వెలిగించి ప్రపంచ రికార్డును సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు చేరుకుంటున్నారు. వారి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ఈసందర్భంగా అక్కడికి వచ్చిన భక్తులు పవిత్ర నగర వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లదంగా ఉందని అన్నారు. మరొకరు ప్రభుత్వం భక్తుల కోసం ఏర్పాట్లను చక్కగా చేసిందని ప్రశంసించారు.
శ్రీరాముడు 14 సంవత్సరాల అరణ్య వాసం అనంతరం రావణుడిపై విజయం సాధించి అయోధ్యకు చేరుకున్న సందర్భంగా సొదరుడు లక్ష్మణుడు ఇక్కడ దీపాలను వెలిగించారని, అలాగే చెడుపై మంచి గెలవడంతో ప్రజలు ఇళ్లను శుభ్రం చేసి, దీపాలను వెలిగించి, రంగులు, పూలతో అలంకరించారని ప్రశస్తి.