Let's talk: editor@tmv.in
తెలంగాణలో 7,437 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

తెలంగాణలో 7,437 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

Gaddamidi Naveen
30 జులై, 2026

గత రెండేళ్లుగా ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని వివిధ పోలీసు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్ఎల్‌‌పీఆర్‌‌బీ) బుధవారం అధికారికంగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలలో మొత్తం 7,437 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఫైర్, ఎమర్జెన్సీ, జైలు విభాగాలకు సంబంధించి 4 నోటిఫికేషన్లు జారీ చేసింది.

1. పోలీస్ శాఖల విభాగాలవారీగా ఖాళీల వివరాలు

• పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 3,697

• పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్): 1,052

• సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్): 148

• అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఫ్‌‌పీబీ): 23

• రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్): 14

• రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (టీజీఎస్‌పీ): 12

• పోలీస్ కానిస్టేబుల్‌ (SARCPL): 24

• పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్ - పీటివో): 20

• రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SARCPL): 3

• పోలీస్ కానిస్టేబుల్ (మెకానిక్ - పీటివో): 7

2.స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్

• కానిస్టేబుల్: 1,380

• సబ్ ఇన్‌స్పెక్టర్: 44

3.అగ్నిమాపక, విపత్తు నిర్వహణ & సివిల్ డిఫెన్స్ శాఖ

• ఫైర్ ఫైటర్: 751

• స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 39

4. జైళ్లు & సరిదిద్దే సేవల శాఖ

• వార్డర్ (పురుషులు): 196

• డిప్యూటీ జైలర్ (పురుషులు): 14

• వార్డర్ (మహిళలు): 12

• డిప్యూటీ జైలర్ (మహిళలు): 1

ముఖ్యమైన సమాచారం & దరఖాస్తు విధానం

• ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించే ఖచ్చితమైన తేదీలను త్వరలో మరో ప్రకటన ద్వారా వెల్లడించనున్నారు.

• అధికారిక వెబ్‌సైట్: అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.tgprb.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో, నియామక ప్రక్రియలో భాగంగా క్రింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

• ఎస్సీ కుల ధ్రువపత్రం: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్సీ అభ్యర్థులు ఎస్సీ గ్రూప్-I, ఎస్సీ గ్రూప్-II, ఎస్సీ గ్రూప్-III సబ్-క్లాసిఫికేషన్‌తో కూడిన లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

• ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్: తెలంగాణ ప్రభుత్వంచే ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత జారీ చేయబడిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్.

• నాన్-క్రీమీలేయర్ సర్టిఫికేట్: బీసీ అభ్యర్థుల కోసం ఏప్రిల్ 1, 2026 లేదా ఆ తర్వాత జారీ చేసిన సర్టిఫికేట్.

• స్థానికత ధ్రువపత్రాలు: 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్లు. వర్తించే అభ్యర్థులకు ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాలు.

ట్యాగ్‌లు
TelanganaPoliceTSLPRBPoliceJobsTelanganaJobsGovtJobsPoliceRecruitmentTSPoliceSIJobsConstableJobsFireFighterJobsWarderJobsJobAlertTelanganaHyderabadLatestNews
తెలంగాణలో 7,437 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల - Tholi Paluku