

తెలంగాణ లోక్‌భవన్‌లో ఆయుధ పూజ
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి, పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం భద్రతా విధుల్లో వినియోగించే ఆయుధాలతో పాటు అధికారిక వాహనాలకు ఆయుధ పూజ నిర్వహించారు.
లోక్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వారితో కలిసి గవర్నర్ గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా అధికారులకు, సిబ్బందికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ, నవరాత్రులు, విజయదశమి పండుగలను సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. పండుగలు ప్రజల జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు, సిరిసంపదలు తీసుకురావాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు.
