
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ ప్రారంభం
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబుతో 'ఎస్ఎస్ఎమ్బి' సినిమా కోసం బిజీగా ఉన్నారు. ఈ గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం నవంబర్ అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే రాజమౌళి సమర్పణలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే, ఇది ఆయన దర్శకత్వం కాదు, సమర్పకుడిగా మాత్రమే వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కార్తికేయ తన 'షోయింగ్ బిజినెస్' బ్యానర్‌పై 'ప్రేమలు' చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి విజయం సాధించారు. ఇప్పుడు 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్', 'ఆక్సిజన్' అనే రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు. 'బాహుబలి' ఫేమ్ శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆర్కా మీడియా వర్క్స్‌తో ఈ చిత్రాలకు భాగస్వాములయ్యారు. 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' లో మలయాళ స్టార్ ఫాహద్ ఫాసిల్ హీరోగా నటిస్తూ, కొత్త దర్శకుడు షశాంక్ యెలేటి టాలీవుడ్లో అడుగుపెడుతున్నారు.
ఈ థ్రిల్లింగ్ ఫాంటసీ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. 2026లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కార్తికేయ నిర్మాణంలో మరో చిత్రం 'ఆక్సిజన్' కూడా ఫాహద్ ఫాసిల్తోనే తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌లు టాలీవుడ్లో కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తూ పాన్ ఇండియా స్థాయిలో సందడి చేయనున్నాయి.