
డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ ‘మహా ధర్నా’
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, తెలంగాణ బీజేపీ డిసెంబర్ 7న ‘మహా ధర్నా’ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
డిసెంబర్ 7తో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండో సంవత్సరం పూర్తవుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నం. రామచందర్‌రావు గురువారం ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్‌ను సందర్శించి, నిరసన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ, ఆరు హామీలు మరియు 66 ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా ఉందని ఆయన ఆరోపించారు. డిసెంబర్ 7న జరిగే మహా ధర్నాకు ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు కూడా బీజేపీ వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ, నగర పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీలను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలన్న నిర్ణయాలను బీజేపీ తీవ్రంగా ఎత్తిపొడుస్తోంది.
డిసెంబర్ 1న బీజేపీ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు వినతి పత్రం సమర్పించి, ఇటీవల ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ అమలును తక్షణం నిలిపివేయాలని కోరింది.
ఈ పాలసీ ద్వారా 9,292.53 ఎకరాల అత్యంత విలువైన భూములను రాజకీయ, రియల్ ఎస్టేట్ కుంభకోణానికి అప్పగించేందుకు ప్రయత్నం జరుగుతోందని బీజేపీ ఆరోపించింది.
ఈ ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ, తెలంగాణ ఐటీ & పరిశ్రమల మంత్రి దన్నా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఈ పాలసీ ప్రభుత్వం లీజ్‌పై ఇచ్చిన భూములకు ఎలాంటి ప్రభావం చూపదని, పరిశ్రమల యజమానులే స్వంతంగా కలిగిన భూములపై కేవలం కన్వర్షన్ ఫీజులు మాత్రమే విధిస్తుందని స్పష్టం చేశారు.
“ఈ పాలసీలో ప్రభుత్వ భూముల హక్కుల బదిలీ లేదా ఫ్రీహోల్డ్‌కు సంబంధించిన అంశమే లేదు,” అని మంత్రి తెలిపారు
ప్రభుత్వం ప్రకారం, వాడుకలో లేని చెరువులు, పడిపోయిన పరిశ్రమల భూములను మళ్లీ వినియోగంలోకి తీసుకురావడం కోసం, అలాగే హైదరాబాద్‌లో గత 30, 40 ఏళ్లలో చాలా పరిశ్రమలు మూసుకుపోయాయి, కొన్ని మార్చి పెట్టారు. అలాంటి వాటి దగ్గర పరిశ్రమల పేరుతో ఇచ్చిన పెద్ద పెద్ద భూములు ఖాళీగా, పాడుబడ్డ స్థితిలో ఉన్నాయి. ఈ ఖాళీ భూములను తిరిగి ఆర్థిక కార్యకలాపాల కోసం ఉపయోగించేలా చేయటం. ఈ పాలసీ ఉద్దేశ్యం. ఇంతకుముందు, పరిశ్రమ యజమానులు భూమిని ఇతర ఉపయోగాలకు మార్చుకునే అవకాశం ఇవ్వడం, అలాగే ప్రభుత్వం దగ్గర పొందిన పరిశ్రమ భూమిని వాణిజ్య, నివాస యోగ్యంగా మార్చడం వంటివి కఠిన నియమాలుగా ఉండేవి.
కానీ కొత్త పాలసీ ప్రకారం, పరిశ్రమ భూమి, ఇతర వినియోగాలుగా మార్చుకోవచ్చు, కానీ కన్వర్షన్ ఫీజు చెల్లించాలి అంటోంది ప్రభుత్వం. ప్రభుత్వం చెప్పే లాజిక్ ఏంటంటే పరిశ్రమలు నడపలేని వారు కనీసం భూమిని వేరే విధంగా ఉపయోగించి పెట్టుబడులు రాబట్టే అవకాశం ఉంటుంది.
మొత్తం మీద హైదరాబాద్‌లో భూముల వినియోగాన్ని “పరిశ్రమల కట్టుబాట్ల నుండి విముక్తం” చేయడం. మహానగరం అభివృద్ధి చెందుతున్న కొద్ది, ఓఆర్ఆర్ లోపల ఉన్న చాలా పరిశ్రమల భూములు రియల్ ఎస్టేట్ విలువ పొందాయి. ఇంకా ఇక్కడ పరిశ్రమలు పెట్టడం వలన అసలు ఉపయోగం లేకపోవడం వల్ల వ్యాపారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ భూములను “పరిశ్రమలుగా ఉంచాలా? లేదా వేరే ఉపయోగాలకు మార్చాలా? నిర్ణయం యజమానులే తీసుకోండి.”అని చెబుతోంది.
రాష్ట్రానికి రెవెన్యూ పెరగడం
కన్వర్షన్ ఫీజు, ఛార్జీలు ద్వారా భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సుమారు వేల కోట్ల ఆదాయమొస్తుందనే అభిప్రాయం. పాలసీని బీజేపీ “భూముల అమ్మకం”గా విమర్శిస్తే, ప్రభుత్వం దాన్ని రాజ్య ఆదాయం, సంస్కరణ గా చూపుతోంది. అంతేకాదు, నగర విస్తరణలో భూవినియోగం ప్రణాళికబద్ధంగా ఉండేలా చేస్తామని ప్రభుత్వం భావిస్తోంది
జీఎచ్ ఎమ్ సి విస్తరణ, ఓ ఆర్ ఆర్ మధ్య ఉన్న ప్రాంతాలు, కొత్త రింగ్ రోడ్ ప్లాన్లు ఇవన్నీ భూముల వినియోగ విధానం మార్చుకోవాల్సిన అవసరం తెచ్చాయని ప్రభుత్వ వాధనగా ఉంది.
