
టెర్రిఫైయింగ్‌గా ‘ఈషా’ గ్లింప్స్
‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రంబాయి’ వంటి చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న బ్లాక్‌బస్టర్ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి కాంబినేషన్ మరోసారి సిద్ధమైంది. టెర్రిఫిక్ హార్రర్‌గా, భయానక థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న చిత్రం ‘ఈషా’. త్రిగుణ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా డిసెంబరు 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
‘రాజు వెడ్స్ రంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్, బిగ్‌బాస్ ఫేమ్ సిరి హన్మంత్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ‘యానిమల్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బబ్లీ పృథ్వీ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. గురువారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో మేకర్స్ ‘ఈషా’ గ్లింప్స్‌ను విడుదల చేశారు. కేవలం కొన్ని సెకన్లలోనే ప్రేక్షకుల నరనరాన్ని గజగజలాడించే భయానక ప్రపంచాన్ని ఈ గ్లింప్స్ చూపెట్టింది.
స్కూలు పిల్లలు దెయ్యాల గురించి చర్చిస్తూ, ‘అవన్నీ కల్పితాలు, ఏమీ ఉండవు’ అంటూ నవ్వుతారు. కానీ పెద్దవాళ్లయ్యాక అదే భయానక అనుభవాలు ఎదుర్కొంటారు. గ్లింప్స్‌లో కనిపించే టెర్రర్ సీన్స్, జంప్ స్కేర్స్ వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉన్నాయి. గ్లింప్స్‌లో ముఖ్యమైన పాత్రల పరిచయంతోపాటు లాస్ట్ షాట్ చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆర్.ఆర్. ధ్రువన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్‌లలో భయాన్ని రెట్టింపు చేసేలా ఉంది. సంతోష్ సనమోని సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్‌గా ఉన్నాయి. బన్నీ వాస్, వంశీ నందిపాటి గత చిత్రాల విజయాలతో ‘ఈషా’పై అంచనాలు భారీ గానే ఉన్నాయి.
హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మించగా, బన్నీ వాస్ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై దేకమేబర్ 12న గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు సాగుతున్నాయి.
