
జిల్లాల్లో కలెక్టరేట్ భవనాల డిజైన్లపై ప్రభుత్వం సమీక్ష
Pinjari Chand
21 ఆగస్టు, 2026
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లా కలెక్టరేట్ భవనాల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం సమీక్షిస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం శాసనసభలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల జారీ చేసిన పీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) మార్గదర్శకాల ప్రకారం కలెక్టరేట్ భవనాల నిర్మాణ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. డిజైన్లను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఆయా కలెక్టరేట్ల నిర్మాణంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
భీమవరం కలెక్టరేట్ ప్లాన్ సిద్ధం
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ భవన నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధంగా ఉందని బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జిల్లా పరిపాలన కార్యకలాపాలు భీమవరం సమీపంలోని ఓ ప్రైవేటు భవనంలో కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.
