Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నాశనం:వైఎస్ జగన్

చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నాశనం:వైఎస్ జగన్

Pinjari Chand
4 డిసెంబర్, 2025

టీడీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ గురువారం విరుచుకుపడ్డారు. విలేకరులతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు హాయాంలో గతంలో జరిగిన అవినీతి,ప్రస్తుత స్కాంల ను వివరించారు. అలాగే గతంలో పరిపాలించిన మా వైసీపీ ప్రభుత్వం పై ఏ విధంగా బురద జల్లారో వివరించారు. మొంథా తుఫాన్ సమయంలో వీళ్లు అనేక బిల్డప్పులు ఇచ్చారు. అలాగే దత్తపుత్రుడు ఏ విధంగా కలరింగ్ ఇచ్చారో అందరు చూశారు. వీరు ఆర్టీజీఎస్ లో వీరు కూర్చోకపోతే తుఫాన్ బీభత్సం చేసేదేమోనన్న రేంజులో వీరి మీడియా బాకాలు ఊదిందని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తుఫాన్ తర్వాత ఏ రైతుకి నష్టపరిహారం ఇవ్వలేదు. 19 నెలల కాలంలో 17 సార్లు విపత్తులు వచ్చాయి. ఇప్పటివరకు రైతులకు ఇన్​ ఫుట్ సబ్సీడి రూ.1700కోట్ల బకాయి ఉంది. ఉచిత పంటల బీమాను ఈ ప్రభుత్వం రద్దు చేసింది. 84 లక్షల మంది రైతులకు 19 లక్షల రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా పోయింది. రైతులు పండించిన ఏ పంటకూ ఈ రోజు గిట్టుబాటు ధరలేదు. ప్రస్తుతం దిత్వా తుఫాన్ సమయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తి వ్యవహారిస్తోంది. ఈ పంటకోతల సమయంలో ప్రభుత్వం చేతులేత్తిసింది. తుఫాను గురించి ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం స్పందించలేదు. వైసీపీ ప్రభుత్వంలో చీని,ఆరటి పళ్ల రైతుల కోసం ఢిల్లీకి, మహారాష్ట్రకు ప్రత్యేక రైళ్లు నడిపాం.ఇప్పుడు ఇంతా నష్టం జరుగుతున్నా చంద్రబాబు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? చంద్రబాబు నాయుడు రోజూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడంలో చాలా ఫేమస్. అన్నదాత సుఖీభవ ఊసేలేదు. మా హయాంలో ఆర్బీకేలను సమర్థంగా నిర్వహించారని తెలిపారు.

సూపర్ సిక్స్ ల అమలు ఎక్కడ?

ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలయ్యాయని పదేపదే చెబుతున్నారు. సూపర్ సిక్స్–సూపర్ హిట్టు అని పత్రికా ప్రకటనలు గుప్పిస్తున్నారు. వీరు గోబెల్స్ ప్రచారంలో మించిపోయారు. చంద్రబాబు గ్లోబెల్స్ కు గురువు. ఈ రెండేళ్లలో నిరుద్యోగ భృతి ఎక్కడ ఇచ్చారు? ఆడబిడ్డ నిధి ఎవరికి ఇచ్చారు. 50 సంవత్సరాలకే ఫించన్ ఇచ్చాడా? అన్నదాత సుఖీభవ సగం ఇచ్చి ఎగరగొట్టారు. తల్లికి వందనంలో కోతలు పెట్టారు.ఏడాదికి మూడు సిలిండర్లు ఎవరికి ఇచ్చాడు? ఉచిత బస్సు ప్రయాణంలో అనేక నిబంధనలు? టీవీ 5, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఈవేవీ రాయవు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థుల డ్రాపౌట్స్ పెరుగుతున్నాయి. రూ.4900 కోట్లకు పైగా బకాయిలు పెట్టారు. విద్యాదీవెనలోనూ బకాయిలే. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. నాడు–నేడు, గోరుముద్ద, ట్యాబులు అన్ని ఆగిపోయాయి. హాస్టళ్లలో కలుషిత ఆహారం వల్ల 29 మంది పిల్లలు చనిపోయారు. కురుపాంలో పిల్లలను నేను పరామర్శించానని జగన్ తెలిపారు.

ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి

ఆరోగ్య శ్రీని నడపడానికి నెలకు రూ.300 కోట్లు ఖర్చవుతాయి. ఈ ప్రభుత్వం వచ్చిన కాలంలో రూ.5400 కోట్లు బకాయిలు పెట్టారు. ఆసుపత్రుల యాజామాన్యం ఇటీవల ధర్నా చేశాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీలది ఓ పెద్ద స్కాం. అన్ని వసతులు ప్రభుత్వమే కల్పించింది. కానీ మెడికల్ కాలేజీల ఓనర్లు ప్రైవేటు వాళ్లు. ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. డిసెంబర్ 16న రాష్ట్ర గవర్నర్ కు కోటి సంతకాల వివరాలను అందజేస్తాం.

ఉద్యోగులకు ఐదు డీఏ ల బదులు ఒకటే ఇచ్చారు. జీవో నం.60లో ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఇస్తామనడం విడ్డూరం. పీఆర్సీ చైర్మన్ ను ఇప్పటి వరకు నియమించలేదు. మెరుగైన పీఆర్సీ ఓ బూటకం. ఓపీఎస్, ఐఆర్ లేదు. మేం వచ్చాక 26శాతం ఇచ్చాం. ఉద్యోగులకు వివిధ రూపాల్లో రూ.31000 బకాయిలు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రెండు,మూడు నెలలకోసారి జీతాలు ఇస్తున్నారు. గెస్ట్ లెక్చర్లర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ కాకుండా మేం అడ్డుకున్నాం. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామన్నారు. ఈ రోజు పని చేయకుండా జీతాలు ఇవ్వల అంటున్నారు. పీడీ యాక్ట్ పెట్టి జైళ్లో పడేస్తామని ఉద్యగులను భయపడిస్తున్నారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు కూటమి నాయకులు మద్దతిస్తున్నారు.

కల్తీ మద్యం దందాలో కూడా టీడీపీ నాయకులే

కల్తీ మద్యంలో కూడా టీడీపీ నాయకులే దందా చేస్తున్నారు. అయ్యన్నపాత్రుడు, టీడీపీ నాయకుల సన్నిహితులే ఉన్నారు. రాష్ట్రవాప్యంగా కల్తీ లిక్కర్ షాపులు పెట్టింది వీరే. వీరి రెడ్ బుక్ పాలనలో వీరే అంతా కల్తీ దందా చేస్తున్నారు. కానీ జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. ఇప్పటికీ మొలకల చెరువు దందాలో ఉన్న టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయలేదు.అధికార దుర్వినియోగ పాల్పడుతూ మా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. అన్ని వ్యవస్థలు కూటమి చేతుల్లోనే ఉన్నాయి. జోగి రమేష్ కొడుకును అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ వర్గీయులు గొడవ పడి చనిపోతే పిన్నెల్లి బ్రదర్స్ను కేసుల్లో ఇరికిస్తున్నారు. అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు కూడా దీనిపై వివరణ ఇచ్చారు. పిన్నెల్లి పై 16 కేసులు పెట్టారు. విశాఖలో విద్యార్థి నాయకులపై గంజాయి కేసులు పెట్టారు. లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్నారు. ఆయనపై ఉన్న కేసును తప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మిథున్‌ రెడ్డిని కూడా లేని లిక్కర్ కేసులో అరెస్ట్ చేయించారు. రూ.11 కోట్ల డబ్బులు దొరికినట్టు చూపిస్తున్నారు. లేని పోని కల్పితాలు సృష్టిస్తున్నారు. భాస్కర్ రెడ్డిని, వల్లభనేని వంశీ, ఐఏఎస్ అధికారులను, పోసాని కృష్ణమురళీ, కొమ్మినేని లాంటి వారి పై కూడా కేసులు పెట్టారు. సాలూరులో మంత్రి పీఏ మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కేసు లేదు. అది రాస్తే సాక్షి విలేకరిపై కేసు పెట్టారు.

టీటీడీ పై కూడా రాజకీయ కుట్రలు

టీటీడీని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని, దాన్ని లడ్డూలో కలిపారని, దాన్ని భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా? కల్తీ నెయ్యి ఉన్న ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్లినట్టు ఆధారాలు ఉన్నాయా? టీటీడీలోకి వచ్చే ఆ ట్యాంకర్లు ఎన్ఏబీఎల్ సర్టిఫికేట్ తోనే రావాలి. టీటీడీ ల్యాబ్ లో కూడా నిర్వహించే టెస్ట్ లో కూడా సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిస్తారు. లేకుంటే రిజెక్ట్ చేస్తారు. వైసీపీ హయాంలో 18 సార్లు, టీడీపీ హయాంలో 15 సార్లు వెనక్కి పోయాయి. సెప్టెంబర్ 28, 2024లో టీటీడీ ఈవో నాలుగు ట్యాంకర్లను రిజెక్ట్ చేసి పంపామని తెలిపారు. చంద్రబాబు హయాంలోనే జూలైలో కూడా ఈ విధంగానే తిప్పి పంపారు. మళ్లీ ఆగష్టులో తిరిగి వచ్చాయని లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్ట్ లో సిట్ లో రాశారు. నెల రోజుల తర్వాత ఏ విధంగా మళ్లీ వచ్చాయి. దాని ప్రకారం ఎవరిని జైల్లో వేయాలి? టీటీడీ ఈవో,చైర్మన్ ఏం చేస్తున్నారు? ఇప్పుడున్న చంద్రబాబు హయాంలో వారినెందుకు జైల్లో వేయడం లేదు.

స్వచ్ఛమైన నెయ్యి రూ.320కి ఎలా సఫ్లై చేస్తారని మమ్మల్ని ప్రశ్నించారు. ఇప్పుడు ఎంతకు కొంటున్నారు. 2014–2019 లో రూ.276–316 మధ్య కొన్నారు. మరి అదంతా కల్తీ నెయ్యేనా అని ప్రశ్నించారు.

బోలే బాబా ఎవరు?

ఉత్తరాఖండ్ కు చెందిన హర్ష ప్రెష్ డైరీ ప్రాడెక్ట్స్ ప్రవేట్ లిమిటెడ్ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడానికి టెండర్లు దక్కించుకుంది. 2018లోనే టీటీడీకి పాలు సరఫరా చేయడానికి సాంకేతికంగా అర్హత సాధించారు. మరి అప్పడు ఈ కంపెనీయే నెయ్యి సరఫరా చేసింది కదా?

తిరుమలకు అనేక కంపెనీలు సరఫరా చేస్తుంటాయి. నిజాలు బయటకు తీసుకురండి అంటూ వైవి సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈయన కనీసం 35 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. ఆయన పైన అనవసర ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నాయకులు.

సిట్ లో ఉన్న అధికారులు ఎవరు?

సిట్ లో ఒకరు ఎన్టీఆర్ మోమోరియల్ ట్రస్టీ లో ఉన్న కృష్ణయ్య బంధువైన గోపినాథ్ జెట్టి ఉన్నారు. ఏపీ పోల్యూషన్ కంట్రోల్ బోర్టులో కృష్ణయ్య ఇప్పటికి ఉన్నారు. డీఐజీ త్రిపాఠి, ఈయన మాఫియాకు కొమ్ముకాసేవాడు.

టీడీపీ ఎంపీ అయిన వీపీఆర్ పీఏ అప్పన్న, ఏపీ భవన్ లో ఎంప్లాయ్ గా ఉన్నాడు. వైవీ సుబ్బారెడ్డి పీఏ గా ప్రస్తుతం ప్రచారం చేస్తున్నారు.

పరకామణి కేసు

హుండీలో తొమ్మిది యూఎస్ డాలర్ల చోరీ జరిగింది. దాని విలువ రూ.72 వేలు. దానికి ఆ దొంగ ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు టీటీడీ కి ఇచ్చారు. కేసు పెట్టారు. చార్జీషీట్ వేశారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నం చేశారు. దొరికిన దొంగ జీఆర్ స్వామి మఠంలో 30 ఏళ్లుగా పని చేస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో కూడా పని చేశారు. వైసీపీ హయాంలో పరకామణిలో అనేక మార్పులు చేశాం. సాంకేతికంగా ఉన్నతీకరించాం. మా హాయాంలో ఆ దొంగను పట్టుకున్నాం. వర్లరామయ్య తిరుపతి జడ్జీపైనే మాట్లాడుతున్నారు. టీటీడీకి మంచి చేయడం కోసం ఇక్కడి జడ్జీలు ప్రయత్నం చేశారు. వారిపైనే మళ్లీ టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. 2025 సెప్టెంబర్ 1 న సింహచలంలో హుండీలో రూ.55 వేలు దొంగతనం చేస్తూ ఇద్దరు ఉద్యోగులు రమణ, సురేశ్ పట్టుబడ్డారు. పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. వారిపై ఎందుకు సమగ్ర విచారణ చేయలేదు. ఆ ఆలయానికి ధర్మకర్త అశోక్ గజపతి రాజు వ్యవహరిస్తున్నారు. మరి ఎందుకు ఆయనను విచారించడం లేదు.

యస్ బ్యాంక్ నాశనమైంది

గతంలో టీడీపీ హయాంలో టీటీడీ తిరుచానూరులో కపిలతీర్థం వరకు శ్రీనివాస సేతు అనే ఫ్లై ఓవర్ నిర్మించడానికి రూ. 684 కోట్లు కేటాయించారు. ఆ డబ్బును టీటీడీ బోర్టు నుంచి తీసుకున్నారు. మేం వచ్చాక మళ్లీ ఆ పనులను పరిశీలించి రూ.40 కోట్లు మిగిలేలా చేశాం. కొత్త బోర్టు రాకుంటే ఈ డబ్బులు ఎవరి జేబులోకి పోతుండే? టీటీడీ డబ్బులను 10 శాతానికి మించి ప్రైవేట్ బ్యాంక్ లో జమ చేయకూడదు ఇది రూల్. అయితే చంద్రబాబు హయాంలో ఆయన దేశాలతో ఎస్ బ్యాంక్ లో రూ.1300 కోట్లు పెట్టించారు. మేం వచ్చి విత్ డ్రా చేయించి నేషనలైజ్ బ్యాంక్ లో పెట్టాం. తరువాత 3 నెలలకే ఎస్ బ్యాంక్ కోలాప్స్ అయ్యింది. మరి ఈ డబ్బులు అక్కడే ఉంటే ఏమయ్యేది. టీటీడీ కాబట్టి రాజకీయాలు చేయలేదు. కానీ టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారు. టీటీడీ విశిష్టమైన సంస్థ. స్వతంత్ర వ్యవస్థ. దేవుడి ప్రతిష్టను దిగజార్చుతూ రాజకీయాలు చేశారు.

చంద్రబాబు బెయిల్ పై ఉన్నాడు. తన మీద ఉన్న కేసును విత్ డ్రా చేయించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. చంద్రబాబు పై కేసులు పెట్టిన అధికారులను భయపెట్టి కేసును విత్ డ్రా చేయించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎల్లో మీడియా రాయడం లేదు.

చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నాశనం:వైఎస్ జగన్ - Tholi Paluku