Let's talk: editor@tmv.in
ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు

ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు

Gaddamidi Naveen
21 ఆగస్టు, 2026

మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ అందరికీ స్ఫూర్తిదాత అని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయాలైన శాంతి, సోదరభావం, సమానత్వం పునాదులుగా బలమైన భారత్‌ను నిర్మించాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ జయంతిని దేశవ్యాప్తంగా "సద్భావనా దివస్" గా జరుపుకుంటారని, ఇది శాంతి, మత సామరస్యం మరియు జాతీయ సమగ్రత సందేశాన్ని వ్యాప్తి చేస్తుందని తెలిపారు.

టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్, రాజీవ్ చౌక్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశ అభివృద్ధిలో, ముఖ్యంగా యువత సాధికారత, సాంకేతిక పరిజ్ఞానం పెంపు, స్థానిక స్వపరిపాలన సంస్థల (పంచాయతీ రాజ్) బలోపేతంలో రాజీవ్ గాంధీ చేసిన సేవలను మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేసుకున్నారు. రాజకీయ ప్రయాణంలో యువతకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాయి.

ఘనంగా రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు - Tholi Paluku