Let's talk: editor@tmv.in
గణపతి నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం

గణపతి నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్‌కు ఆహ్వానం

Gaddamidi Naveen
11 సెప్టెంబర్, 2026

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గణపతి పండుగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 14న వినాయక చవితిని పురస్కరించుకుని వీధివీధినా పండుగ వాతావరణం సంతరించుకుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలు, ఘనమైన ఆడంబరాల మధ్య జరుపుకోవడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు.

సికింద్రాబాద్‌ గణేష్‌ దేవాలయంలో నిర్వహించనున్న గణపతి నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని దేవాలయ కమిటీ ఆహ్వానించింది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో దేవాదాయ శాఖ కమిషనర్‌తో పాటు శ్రీ గణేష్‌ దేవాలయ కమిటీ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు.