
కుమారుడి వివాహానికి సీఎం రేవంత్‌ను ఆహ్వానించిన భట్టి విక్రమార్క
Gaddamidi Naveen
1 మార్చి, 2026
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి ఆదివారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాలని కోరుతూ ముఖ్యమంత్రి దంపతులకు వారు స్వయంగా వివాహా శుభలేఖను అందజేసి ఆహ్వానించారు.
సూర్య విక్రమాదిత్య వివాహం ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో సంభాషణ సాగింది. అత్యంత సన్నిహితులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరగనున్న ఈ వేడుకకు రావాల్సిందిగా భట్టి విక్రమార్క ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.
