Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
కాంతార చాప్టర్ 1కు కలెక్షన్ల రికార్డు

కాంతార చాప్టర్ 1కు కలెక్షన్ల రికార్డు

Thaduri Lalitya
20 అక్టోబర్, 2025

అక్టోబర్ 2న విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తూ సంచలనం సృష్టిస్తోంది. ఒకప్పుడు కాంతార ఎవ్వరు ఊహించని విధంగా ప్రేక్షకులను వెండి తెరపై మెప్పించి, బాక్సాఫీస్ కు కొత్త రికార్డులు సెట్ చేసింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ సినిమా, రూ. 700 కోట్లకు పైగా వసూలు చేసి రూ. 800 కోట్ల మైలురాయి వైపు దూసుకెళ్తోంది. కర్ణాటకలో రూ. 200 కోట్ల గ్రాస్‌తో ‘కేజీఎఫ్ 2’ రికార్డును బద్దలు కొట్టి, తొలి కన్నడ చిత్రం గా చరిత్ర సృష్టించింది.

బెంగళూరులోని పీవీఆర్ ఓరియన్ మాల్‌లో 15 రోజుల్లో 550కి పైగా షోలతో రూ. 5 కోట్ల గ్రాస్ వసూలు చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. రిషబ్ శెట్టి సరసన రుక్మిణీ వసంత్ నటించిన ఈ చిత్రంలో జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, సురేష్ మల్లయ్య ఎడిటింగ్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి.

కాంతర కు కన్నడ ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. రికార్డుల మోత మోగించేలా కాసుల వర్షం కురిపిస్తున్నారు ఆడియన్స్. రూ. 125 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన కాంతార చాప్టర్ 1, కర్ణాటకలో రూ. 169 కోట్లతో సహా ప్రపంచవ్యాప్తంగా రూ. 440 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. లాభాలకు రూ. 850 కోట్ల గ్రాస్ అవసరమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరుకు 17 రోజుల్లో భారత్‌లో రూ. 589.5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ. 104.5 కోట్లతో, మొత్తం రూ. 694 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. హోంబలే ఫిల్మ్స్ లెక్కల ప్రకారం, రెండు వారాల్లో రూ. 717.5 కోట్లు రాబట్టింది. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, హిందీ, తమిళ, మలయాళ బెల్ట్‌లలో ఈ సినిమా జోరు కొనసాగుతోంది. 4400 థియేటర్లలో విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ సినీ ప్రియులను గొప్పగా మెప్పించింది.

కాంతార చాప్టర్ 1కు కలెక్షన్ల రికార్డు - Tholi Paluku