Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు వీహెచ్ మద్దతు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు వీహెచ్ మద్దతు

Gaddamidi Naveen
20 అక్టోబర్, 2025

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌)పై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్‌ నేత వి. హనుమంతరావు మద్దతు తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దేశ ఐక్యతకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, మైనారిటీల హక్కులు, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన రిజర్వేషన్లకు ఎప్పటి నుంచో వ్యతిరేకంగా ఉందని ఆయన విమర్శించారు.

హనుమంతరావు మాట్లాడుతూ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పినది సత్యం. బాబాసాహెబ్ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పటి నుంచో వ్యవహరిస్తోందన్నారు. రాహుల్ గాంధీ కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నిలుస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దేశాన్ని విభజించాలనుకుంటే, రాహుల్ గాంధీ ఈ దేశాన్ని ఐక్యం చేయాలనుకుంటున్నారని హ‌నుమంత‌రావు తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను వ్యతిరేకించాలని అన్నారు.

సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్య‌లు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలను పరిమితం చేయడానికి ఇప్పటికే చర్యలు ప్రారంభించామని వెల్లడించారు. ప్రజా ప్రదేశాల్లో ఎవరు అయినా ప్రజల శాంతిని భంగం కలిగించరాదని పేర్కొన్నారు. తమిళనాడులో ఈ విషయంలో చర్యలు తీసుకున్నారని తెలిపారు. మేము కూడా ఆ విధంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయ‌న‌ విలేకరులతో మాట్లాడారు.

సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇటీవల సీఎం సిద్ధరామయ్యను కోరుతూ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలను నిషేధించాలని విజ్ఞప్తి చేయడం ద్వారా ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ యువత మనసులను మాయ చేస్తున్నదని, రాజ్యాంగ విరుద్ధమైన సిద్ధాంతాలను బోధిస్తోందని ఆరోపించారు. తన వ్యాఖ్యల తర్వాత తాను బెదిరింపులు ఎదుర్కొంటున్నానని ప్రియాంక్ ఖర్గే తెలిపారు. గత రెండు రోజులుగా నా ఫోన్‌ ఆగడం లేదు. బెదిరింపులతో, దూషణలతో నిండిన కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు. నేను ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలను ప్రభుత్వ సంస్థల్లో నిలిపివేయాలని కోరినందుకు నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలంతో దాడి చేస్తున్నారని ఆయన ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలపై కర్ణాటకలో రాజకీయ చర్చ వేడెక్కుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ నాయకులు దేశ ఐక్యత, రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు.

తమిళనాడులో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై తీసుకున్న చర్యలు

ప్రభుత్వ ప్రాంగణాల్లో, పాఠశాలల్లో అనుమతి లేని సామూహిక కార్యాకలాపాలపై నియంత్రణ జూలై-సెప్టెంబర్ 2024లో విద్యాశాఖ ప్రభుత్వ పాఠశాలల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వినియోగంపై ఒక నిబంధనలు విడుదల చేసింది, అందుబాటులో ఉన్న పాఠశాల ప్రాంగణాల్లో అనుమతి లేకుండా కార్యక్రమాలు చేయకూడదని హెడ్‌మాస్టర్లు హెచ్చరించారు. చెన్నైలోని అయ్యప్పాంతాంగల్ ప్రభుత్వ హైయర్‌సెకండరీ స్కూల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖ/పూజ కార్యక్రమం అనుమతి లేకుండా నిర్వహించబడింది. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు చర్య తీసుకున్నారు. పోలీసులు 39 మంది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలను అర్టెస్ చేసి తీసుకువెళ్లారు.

పూర్తిగా బ్యాన్ విధించకుండా, ప్రభుత్వం ప్రభుత్వ స్థలాల్లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలను ఎలాగైతే నిర్వహించకూడదో అనే నియంత్రణాత్మక మోడల్ రూపొందించింది. ఇది “తమిళనాడు మోడల్” అని చెప్పబడుతోంది. ఈ విధానం ద్వారా రాజకీయంగా తీవ్రతరం కాకుండా, కార్యకలాపాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు వీహెచ్ మద్దతు - Tholi Paluku