Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఏ పేటీఎం బ్యాచ్ నా సినిమాను ఆపలేదు.. ‘మంగపతి’ వార్నింగ్

ఏ పేటీఎం బ్యాచ్ నా సినిమాను ఆపలేదు.. ‘మంగపతి’ వార్నింగ్

Thaduri Lalitya
9 మార్చి, 2026

తెలుగు సినీ నటుడు శివాజీ, నటి లయ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శివాజీ స్వయంగా నిర్మించారు. సంప్రదాయాలను గౌరవిస్తూ అమాయకంగా జీవించే ఓ మహిళ కథ చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథనం. కుటుంబ భావోద్వేగాలు, సంప్రదాయ విలువలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ సినిమా విడుదలైన తర్వాత మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. అయితే, ఈ మిక్స్డ్ టాక్‌పై తాజాగా శివాజీ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శివాజీ మాటల్లో ….సినిమాపై సోషల్ మీడియాలో కావాలనే కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సినీ రంగంలో చాలామంది సుప్పినీలు, సుద్ద పూసలు(అన్నీ తెలిసి ఒక్కొక్కరిదగ్గర ఒక్కోలా నటించే శూర్పణఖ లాంటి వారు, నట శిరోమణులు) ముఖ్యంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో ‘సినిమా పోయింది’ అంటూ ప్రచారం చేసి ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ‘వెయ్యి సబ్‌స్క్రైబర్లు ఉన్న వాళ్లే పేటీఎం కోసం ఇలా ప్రచారం చేస్తున్నారు. నా సినిమాను నాశనం చేయాలని చాలా ట్రై చేశారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు కూడా. కానీ మంచి సినిమాను ఎవరూ ఆపలేరు’ అని శివాజీ వ్యాఖ్యానించారు.

మొదట ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని భావించినట్లు శివాజీ వెల్లడించారు. అయితే ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి వంటి సినీ ప్రముఖుల సూచనలతో థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి కలిసి మార్చి 6న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికీ సినిమాపై తనకు పూర్తి నమ్మకం ఉందని శివాజీ తెలిపారు. ‘సినిమా బాగోలేకపోతే మొదటి షో తర్వాతే ఆడియన్స్ రావడం ఆపేస్తారు. కానీ ఈ సినిమా చూసిన వారు మరో నలుగురికి చెప్పుతున్నారు. నాలుగు రోజుల్లో లేదా వారం రోజుల్లో ఈ సినిమా పుంజుకుంటుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇక శివాజీ గతంలో నటించిన దండోరా చిత్రం గురించి కూడా ప్రస్తావించారు. నవదీప్, నందు, బిందు మాధవి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో తన నటనకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులు లో అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. మొత్తానికి, ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల మధ్య శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ఏ పేటీఎం బ్యాచ్ నా సినిమాను ఆపలేదు.. ‘మంగపతి’ వార్నింగ్ - Tholi Paluku