Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఎస్‌బీఐలో 996 స్పెషలిస్ట్ అధికారుల భర్తీకి నోటిఫికేషన్

ఎస్‌బీఐలో 996 స్పెషలిస్ట్ అధికారుల భర్తీకి నోటిఫికేషన్

Praveen Kumar
4 డిసెంబర్, 2025

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా 996 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 2, 2025 నుంచి ప్రారంభమై డిసెంబర్ 23, 2025 వరకు కొనసాగుతుంది. అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఈ నియామకాలు వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగానికి సంబంధించినవి. వీటిలో వీపీ వెల్త్ (సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్), ఏవీపీ వెల్త్ (రిలేషన్‌షిప్ మేనేజర్) , కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీలలో వీపీ విభాగానికి 506, ఏవీపీ విభాగానికి 206, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 284 ఖాళీలు కేటాయించబడ్డాయి.

ఎస్‌బీఐ ప్రకారం, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులు. బ్యాంకింగ్, ఫైనాన్స్ లేదా మార్కెటింగ్‌లో ఎంబీఏ చేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే NISM, CFP, CFA వంటి ధృవపత్రాలు ఉన్న వారికి అదనపు ప్రయోజనం ఉంటుంది. భారత పౌరసత్వం తప్పనిసరి కాగా, తప్పుడు వివరాలు సమర్పించిన వారు లేదా గత చరిత్రపై ప్రతికూల నివేదికలుున్న అభ్యర్థులు అనర్హులుగా భావించబడతారు.

మే 1, 2025 నాటికి వీపీ వెల్త్ పోస్టులకు 26-42 సంవత్సరాలు, ఏవీపీ వెల్త్ పోస్టులకు 23-35 సంవత్సరాలు, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 20-35 సంవత్సరాలు వయోపరిమితి నిర్ణయించారు. రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు లభిస్తాయి.

ఎంపికైన వారికి ఐదేళ్ల ఒప్పందం కల్పించబడుతుంది. అవసరమైతే మరో నాలుగేళ్లపాటు పొడిగించే అవకాశం ఉంటుంది. వీపీ వెల్త్ పదవికి గరిష్ట మొత్తం వేతనం ₹44.70 లక్షలు, ఏవీపీ వెల్త్‌కు ₹30.20 లక్షలు, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్‌కు ₹6.20 లక్షలుగా పేర్కొంది. స్థిర వేతనం, అలవెన్సులు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకం , వార్షిక పెరుగుదలలు ఈ వేతనాల్లో భాగమవుతాయి.

ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ దరఖాస్తుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేసి, అనంతరం వ్యక్తిగత, ఫోన్ లేదా వీడియో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కుల ఇంటర్వ్యూ పనితీరును ఆధారంగా చేసుకొని తుది ఎంపిక జరుగుతుంది. వేతనంపై చర్చ కూడా ఎంపికలో భాగమవుతుంది.

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు ఫోటో, సంతకం, గుర్తింపు పత్రాలు, వయస్సు రుజువు, విద్యా ధృవపత్రాలు, అనుభవ పత్రాలు, జీత వివరాలు తదితర పత్రాలను అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుము సాధారణ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹750గా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

వివరమైన నోటిఫికేషన్, దరఖాస్తు లింకులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఎస్‌బీఐలో 996 స్పెషలిస్ట్ అధికారుల భర్తీకి నోటిఫికేషన్ - Tholi Paluku