Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఆర్బీఐ రెపో రేటును 5.5% వద్దే ఉంచే అవకాశం

ఆర్బీఐ రెపో రేటును 5.5% వద్దే ఉంచే అవకాశం

Dantu Vijaya Lakshmi Prasanna
4 డిసెంబర్, 2025

ఈరోజు జరగబోయే ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రెపో రేటును 5.5 శాతం వద్ద యథాతథంగా ఉంచి, తన ప్రస్తుత వైఖరిని కొనసాగించే అవకాశం ఉందని ఎస్ బ్యాంక్ నివేదిక తెలిపింది.

కొత్తగా రేటును తగ్గించే అవకాశాలు పరిమితంగా ఉన్నందున, కేంద్ర బ్యాంక్ విరామంలోనే కొనసాగే అవకాశం ఉందని ఈ నివేదిక తెలిపింది. కాబట్టి, ఇది "టచ్-అండ్-గో" (స్పర్శించి-వెళ్ళే) పాలసీగా ఉంటుందని, నిర్ణయం ఏ క్షణమైనా మారే అవకాశం ఉందని పేర్కొంది. "డిసెంబర్‌లో ఆర్బీఐ విరామంలోనే ఉండి, రేట్లను, వైఖరిని మార్చకుండా కొనసాగిస్తుందని మేము ఆశిస్తున్నాము". కీలక రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం కంటే తక్కువగా ఉంది. రాబోయే మూడు నుంచి నాలుగు నెలలు తక్కువగానే ఉంటుందని అంచనా వేసినప్పటికీ, భారతదేశ ఆర్థిక వృద్ధి మాత్రం సానుకూలంగా ఆశ్చర్యపరుస్తూనే ఉందని నివేదిక తెలిపింది.

ఎఫ్ వై 26 రెండవ త్రైమాసికంలో వృద్ధి 8.2 శాతంగా ఉంది, అక్టోబర్‌కు సంబంధించిన అధిక ఫ్రీక్వెన్సీ డేటా కూడా స్థిరమైన విస్తరణను సూచించింది. అయితే, ఇటీవల విడుదలైన తయారీ పిఎమ్ఐ, ఐఐపి వంటి కొన్ని సూచికలు తక్కువగా నమోదయ్యాయి. ఇది వేగంలో సంభావ్య మందగింపును సూచిస్తుంది. పండుగల డిమాండ్ మసకబారడం కేంద్రం కాపెక్స్ వ్యయం మందగించడం వల్ల రాబోయే త్రైమాసికాల్లో వృద్ధి సవాళ్లను ఎదుర్కోవచ్చని, అదే సమయంలో, బేస్ ఎఫెక్ట్స్ కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఆర్బీఐ రెపో రేట్లను యథాతథంగా కొనసాగాలని నివేదిక పేర్కొంది.

ఆర్బీఐ తన ద్రవ్యోల్బణ అంచనాలను కూడా తగ్గిస్తుందని, కేంద్ర బ్యాంక్ ఎఫ్ వై 26 కోసం తన ద్రవ్యోల్బణ అంచనాను ప్రస్తుత అంచనా అయిన 2.6 శాతం నుండి 1.8-2.0 శాతానికి తగ్గించవచ్చని తెలిపింది. క్యూ1ఎఫ్ వై 27 ద్రవ్యోల్బణ అంచనాను కూడా ఆర్బీఐ ప్రస్తుత అంచనా అయిన 4.5 శాతం నుండి సుమారు 4 శాతానికి తగ్గించవచ్చని ఈ నివేదిక పేర్కొంది. అయితే ఎస్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని 3.1 శాతంగా అంచనా వేస్తోంది.

ఆర్బీఐ కష్టతరమైన పాలసీ ఎంపికను ఎదుర్కొంటోంది. వృద్ధి బలంగా ఉంది, అయితే ద్రవ్యోల్బణం 2 శాతం కంటే తక్కువగా ఉండటం రేటు కోతకు సమర్థన కావచ్చు.

అయినప్పటికీ, నాలుగు ముఖ్య కారణాల వల్ల ఎలాంటి చర్య తీసుకోకపోవడానికి నివేదిక ఓటు వేసింది. ఫిబ్రవరి 2026లో కొత్త సిపిఐ, జీడీపీ సిరీస్‌ను ప్రారంభించడం, ప్రస్తుత తక్కువ ద్రవ్యోల్బణం ఎక్కువగా కూరగాయలు, జీఎస్టి కోతల కారణంగా ఉండటం, క్రెడిట్ వృద్ధి డిపాజిట్ వృద్ధిని అధిగమించడం, దీని వలన డిపాజిట్ రేట్లు మరింత తగ్గితే రుణాల పంపిణీపై ప్రభావం చూపవచ్చు, మరియు తక్కువ విదేశీ ప్రవాహాలు రూపాయి విలువ క్షీణత ఒత్తిడి, దీని వలన యుఎస్ భారతదేశం మధ్య వడ్డీ రేటు వ్యత్యాసాన్ని తగ్గించడం సరికాదు. డిసెంబర్‌లో రేట్లను, వైఖరిని మార్చకుండా ఉంచడం వలన ఆర్బీఐ స్థిరత్వాన్ని కొనసాగించడానికి, భవిష్యత్తులో పాలసీ సరళతను నిలుపుకోవడానికి సహాయపడుతుందని నివేదిక ముగించింది.

ద్రవ్య విధాన కమిటీ సమావేశం డిసెంబర్ 3-5 వరకు జరుగుతోంది. తుది పాలసీ నిర్ణయాన్ని డిసెంబర్ 5న ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటిస్తారు. చాలామంది ఆర్థికవేత్తలు బ్యాంకులు ఒక రేటు కోత అవసరం ఉందా లేదా రేటును యథాతథంగా (5.5%) ఉంచాలా అనే దానిపై వేరువేరు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే, ఎక్కువ మంది ఆర్థికవేత్తలు రేటును యథాతథంగా ఉంచడానికి మొగ్గు చూపుతున్నారు.

ఎస్బిఐ రీసెర్చ్:

బలమైన Q2 జీడిపి వృద్ధి (8.2%) కారణంగా డిసెంబర్ పాలసీలో రేటును యథాతథంగా ఉంచడానికి మొగ్గు చూపుతుందని పేర్కొంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా:

బలమైన వృద్ధి సూచికలు, అనుకూలమైన ద్రవ్యోల్బణం ధోరణి కారణంగా ఆర్బీఐ రెపో రేటును 5.50 శాతం వద్దే ఉంచే అవకాశం ఉందని తెలిపింది. బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ కూడా తమ నివేదికలలో వృద్ధి బలంగా ఉన్నందున, రేటును తగ్గించవలసిన అవసరం తక్కువగా ఉందని, సడలింపు కోసం పరిమిత స్థలం ఉంది, దానిని వృద్ధికి ప్రమాదం ఉంటే మాత్రమే ఉపయోగించాలని పేర్కొన్నాయి.

రేటు కోత వచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన సంస్థలు

రాయిటర్స్ పోల్, ఇన్ఫార్మిస్ట్ పోల్, ఈ పోల్స్‌లో పాల్గొన్న చాలామంది ఆర్థికవేత్తలు (17 మందిలో 16 మంది) 25 బేసిస్ పాయింట్ల మేర రేటు కోత ఉండవచ్చని అంచనా వేశారు.

ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్:

ద్రవ్యోల్బణం అంచనాల కంటే చాలా తక్కువగా ఉన్నందున, 25 బిపిఎస్ రేటు కోతకు అవకాశం ఉందని పేర్కొంది, అయినప్పటికీ ఇది "క్లోజ్ కాల్" (కఠినమైన నిర్ణయం) అని అభిప్రాయపడింది.

ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ప్రైమరీ డీలర్‌షిప్:

ద్రవ్యోల్బణం ఊహించిన దాని కంటే బాగా తగ్గిందని, కాబట్టి ప్రస్తుత ద్రవ్యోల్బణం అంచనాలకు అనుగుణంగా 25 బిపిఎస్ కోత ఉండవచ్చని పేర్కొంది.

ఎచ్ డీఫ్ సి బ్యాంక్:

తక్కువ నామినల్ వృద్ధి రేట్లు, అధిక టారిఫ్ సంబంధిత రిస్క్‌లు వంటి అంశాల దృష్ట్యా రేటు కోతకు స్థలం ఉందని అభిప్రాయపడింది.

ఇదిలా ఉంటే గురువారం మార్కెట్ ప్రారంబంలోనే రూపాయి మరింత కనిష్టానికి పడిపోయి రూ.90.43 వద్ద స్థిరంగా కొనసాగి తిరిగి మళ్లీ పుంజుకుంది.

ఆర్బీఐ రెపో రేటును 5.5% వద్దే ఉంచే అవకాశం - Tholi Paluku