Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ఆన్‌లైన్ స్టార్‌డమ్ కోసం అడ్డదార్లు

ఆన్‌లైన్ స్టార్‌డమ్ కోసం అడ్డదార్లు

Panthagani Anusha
20 అక్టోబర్, 2025

డిజిటల్ ప్రపంచంలో త్వరగా గుర్తింపు పొందాలనే కోరిక, యువతను కొన్నిసార్లు నేరాల వైపు నడిపించగలదని ఈ కేసు సాక్ష్యం. లక్నోకు చెందిన 19 ఏళ్ల యువకుడు హుకుమ్ సింగ్ రావత్ (ఆన్‌లైన్ పేరు అనుజ్) తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలను అక్రమంగా విక్రయించి, రూ.1.81 లక్షల సైబర్ మోసానికి సంబంధం ఉన్న కేసులో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈవిషయమై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రావత్ లక్నోలో బీఏ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. కాగా రావత్ తన చదువుతోపాటు సోషల్ మీడియా కూడా అంతో సుపరిచితుడు. కాగా రావత్ కు సోషల్ మీడియాలో సుమారు ఒక లక్ష మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే అప్పుడు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే రావత్ తనకున్న ఫేమ్ ను మరింత పెంచుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో వీడియో కంటెంట్‌ను మెరుగుపరచడం కోసంఆధునిక టెక్నాలజీ ని వడాలనుకున్న రావత్ కి కొంత డబ్బు అవసరమైంది.

దీంతో రావత్ తన ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఒక సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌తో ఒప్పందం కుదుర్చుకొని తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతా వివరాలను అప్పగించాడు. అయితే రావత్ ఖాతా వివరాల ద్వారా సైబర్ నేరగాళ్లు దొంగిలించిన డబ్బులు రావత్ ఖాతా మళ్లించి అనంతరం వారి అకౌంట్ కి పంపుకునేవారు. కాగా ఇలా ప్రతి అక్రమ లావాదేవీపై రావత్ 4 నుంచి 5 శాతం కమిషన్ సంపాదించేవాడని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా ఒక అపరిచిత వ్యక్తి ఆన్లైన్ మోసానికి పాల్పడినట్లు చేసిన ఫిర్యాదుతో అసలు మోసం బయట పడింది. ఇక బాధితుడు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో భాగంగా బాధితుడి బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఆధారంగా చేసుకొని మనీ ట్రయిల్ చేయగా బాధిత వ్యక్తి కోల్పోయిన డబ్బు రావత్ ఖాతాలో జమైనట్లు తేలింది. అంతర్మ్ పోలీసులకు దొరికిన సాక్షాలు ఆధారంగా చేసుకొని అక్టోబర్ 14న రావత్ ను అదుపులోకి తీసుకున్నారు.

అయితే విచారణలో రావత్ మోసం ద్వారా వచ్చిన డబ్బును తన సోషల్ మీడియా కంటెంట్ తయారీలో, స్థానిక కళాకారులను నియమించడంలో, వీడియో ప్రొడక్షన్ సామగ్రి కొనుగోలులో ఉపయోగించాడని ఒప్పుకున్నాడు. అయితే తన ఖాతా ద్వారా సైబర్ నేరగాళ్లు డబ్బు మళ్లిస్తున్న విషయం తనకు తెలియదని వాదించాడు. ఇక పోలీసులు కీ డిజిటల్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకుని, రావత్‌కు సంబంధించిన అనేక ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఇంకా ఇతరులు ఈ నేర ప్రక్రియలో పాల్గొన్నారా అనే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది

ఇక ఈ ఘటన ఆధారంగా సైబర్ క్రైమ్ అధికారులు యువతను హెచ్చరిస్తూ సైబర్ సిండికేట్‌లు యువతను టార్గెట్ చేస్తూ, ఎక్కువ మొత్తంలో లాభాలు చూపించి వారి ఖాతాలను “మనీ మ్యూల్స్”గా ఉపయోగిస్తున్నట్లు. ఇలాంటి ఘటనలు గత కొద్ది నెలల్లో ఢిల్లీ, నోయిడా, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఆన్‌లైన్ స్టార్‌డమ్ కోసం అడ్డదార్లు - Tholi Paluku