Let's talk: editor@tmv.in
ఆగస్టు 14న ‘అగధ’ థియేటర్లలోకి.. స్టార్ హీరోల ప్రశంసలతో భారీ అంచనాలు

ఆగస్టు 14న ‘అగధ’ థియేటర్లలోకి.. స్టార్ హీరోల ప్రశంసలతో భారీ అంచనాలు

Gaddamidi Naveen
13 ఆగస్టు, 2026

ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం 'అగధ' ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ‘అగాధ’ శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ పతాకంపై కాశి విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ కెఆర్ సమర్పిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ఆధ్యాత్మిక అంశాలు, చీకటి రహస్యాలతో కూడిన భయానక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌పై సూపర్‌స్టార్ మహేష్ బాబు "ఈసారి కొడుతున్నారు సర్" అంటూ ప్రశంసలు కురిపించగా, దానికి రెబల్ స్టార్ ప్రభాస్ "కొడుతున్నావ్ బావా!" అని స్పందించడం సోషల్ మీడియాలో విశేషంగా నిలిచింది. ఈ ఇద్దరు అగ్ర కథానాయకుల ప్రశంసలతో సినిమాపై అంచనాలు, ఉత్కంఠ ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. 2 గంటల 17 నిమిషాల వ్యవధి కలిగిన ఈ చిత్రం ప్రేక్షకులకు సీటు అంచున కూర్చోబెట్టే అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా కోసం, ఒక రోజు ముందే నేటి నుంచి అల్లు సినిమాస్ వంటి ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ప్రత్యేక పెయిడ్ ప్రిమియర్ షోలను ప్రదర్శిస్తున్నారు. ఈ భయానక థ్రిల్లర్ అనుభూతిని అందరికంటే ముందే పొందేందుకు అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మిస్టరీ, గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాలతో రాబోతున్న 'అగధ' చిత్రం థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

ఆగస్టు 14న ‘అగధ’ థియేటర్లలోకి.. స్టార్ హీరోల ప్రశంసలతో భారీ అంచనాలు - Tholi Paluku