Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ను పరిచయం చేసిన టీమ్‌

‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ను పరిచయం చేసిన టీమ్‌

Gaddamidi Naveen
19 జనవరి, 2026

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, తాజాగా చిత్ర బృందం హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించింది. ఆకాశాన్ని మించిన కలతో ముందుకు సాగుతున్న ఓ యువతీ కథ ఇప్పుడు అందరి మనసులను తాకుతోంది.

ఈ మూవీలో సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. తన కలలకు రెక్కలు ఇచ్చుకుంటూ, కష్టాలను దాటుకుంటూ, ఆశయాల్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన ఈ డ్రీమర్ ఇప్పుడు ఆకాశంలో ఒక తార గా నిలుస్తోంది. ఆమె కథను ప్రతిబింబించేలా రూపొందిన ‘ఆకాశంలో ఒక తార’ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విశేష స్పందన పొందుతోంది. ఈ వీడియో ద్వారా సత్విక ప్రయాణం, ఆమె కలలు, ఆశయాలు మరింత మందికి చేరుతున్నాయి. ఇది కేవలం ఓ వ్యక్తి కథ మాత్రమే కాదు… కలలు కనడానికి, వాటిని నెరవేర్చడానికి ధైర్యం చేసే ప్రతి ఒక్కరికీ ఇది ఒక సందేశం.

కనీస వసతులు కూడా లేని పల్లెటూరిలో పుట్టిన అమ్మాయి తన కలలను ఎలా సాధించుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు గ్లింప్స్‌ ఆధారంగా తెలుస్తోంది.సాత్విక వీరవల్లి నేటి తరం యువతకు ఓ ప్రేరణ. కలలు కనండి… వాటిని నెరవేర్చడానికి ఆకాశాన్ని కూడా మీ వైపే వంచుకోండి అన్న సందేశాన్ని ఆమె కథ చెబుతోంది.

‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్‌ను పరిచయం చేసిన టీమ్‌ - Tholi Paluku