
‘ఆకాశంలో ఒక తార’ హీరోయిన్ను పరిచయం చేసిన టీమ్
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, తాజాగా చిత్ర బృందం హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు తెరదించింది. ఆకాశాన్ని మించిన కలతో ముందుకు సాగుతున్న ఓ యువతీ కథ ఇప్పుడు అందరి మనసులను తాకుతోంది.
ఈ మూవీలో సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. తన కలలకు రెక్కలు ఇచ్చుకుంటూ, కష్టాలను దాటుకుంటూ, ఆశయాల్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన ఈ డ్రీమర్ ఇప్పుడు ఆకాశంలో ఒక తార గా నిలుస్తోంది. ఆమె కథను ప్రతిబింబించేలా రూపొందిన ‘ఆకాశంలో ఒక తార’ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విశేష స్పందన పొందుతోంది. ఈ వీడియో ద్వారా సత్విక ప్రయాణం, ఆమె కలలు, ఆశయాలు మరింత మందికి చేరుతున్నాయి. ఇది కేవలం ఓ వ్యక్తి కథ మాత్రమే కాదు… కలలు కనడానికి, వాటిని నెరవేర్చడానికి ధైర్యం చేసే ప్రతి ఒక్కరికీ ఇది ఒక సందేశం.
కనీస వసతులు కూడా లేని పల్లెటూరిలో పుట్టిన అమ్మాయి తన కలలను ఎలా సాధించుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు గ్లింప్స్ ఆధారంగా తెలుస్తోంది.సాత్విక వీరవల్లి నేటి తరం యువతకు ఓ ప్రేరణ. కలలు కనండి… వాటిని నెరవేర్చడానికి ఆకాశాన్ని కూడా మీ వైపే వంచుకోండి అన్న సందేశాన్ని ఆమె కథ చెబుతోంది.
