
‘అఖండ-2’ విడుదల ఆపాలి: మద్రాస్ హైకోర్టు
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ-2’ సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ, నిర్మాణ సంస్థకు ఊహించని షాక్ తగిలింది.
చెన్నై హైకోర్టు ఈ చిత్రం రిలీజ్, పంపిణీ, వాణిజ్య ప్రయోజనాలపై నిషేధం విధిస్తూ ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఏరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పై ఉన్న రూ.28 కోట్ల అర్బిట్రేషన్ అవార్డును అమలు చేయించేందుకు ఏరోస్ సంస్థ ఈ కేసు వేసింది.
14 రీల్స్ ప్లస్ ఎల్ఎల్పి పేరుతో సినిమాను విడుదల చేయడం పై కోర్టు తీర్పును తప్పించే ప్రయత్నమని గుర్తించిన న్యాయస్థానం, మరిన్ని ఉత్తర్వులు వచ్చే వరకు ఎటువంటి రిలీజ్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది.
ఇప్పటికే నిజాం ఏరియా బుకింగ్స్ ఆలస్యం కావడంతో చాలా సమస్యలు ఎదురుకొన్నారు నిర్మాతలు. అంతే కాకుండా కంటెంట్ డిలే కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రీమియర్ షోలు కూడా రద్దు అయ్యాయి. ఇది ఇలా ఉండగా, ఏరోస్ సంస్థ వారి ఆర్థిక పరిష్కారం మరో భారీ ఎదురుదెబ్బగా మారింది. అయితే ఈ సమస్యలన్నీ వీలయినంత త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లేకపోతే సినిమా విడుదల సమయానికి ప్రభావం మరింత తీవ్రంగా ఉందనున్నదని స్పష్టమవుతుంది.
కోర్టు ఆదేశాలు కేవలం తమిళనాడు రిలీజ్‌కే పరిమితమా? లేక మొత్తం రిలీజ్నా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సాగుతున్న చర్చలు త్వరలోనే సానుకూల ఫలితాన్ని చూపుతాయని, బాలయ్య అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు.
