
నేడు వైఎస్సార్ జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జూలై 7, 8 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు షెడ్యూల్‌ను విడుదల చేశాయి.
జూలై 7న ఉదయం 11.30 గంటలకు వైఎస్ జగన్ పులివెందులకు చేరుకుని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్భార్ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం పులివెందులలోని తన నివాసంలో రాత్రికి బస చేయనున్నారు.
జూలై 8న ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం వైయస్సార్‌కు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రజలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడా జగన్ సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
