Let's talk: editor@tmv.in
వైసీపీవి ఆత్మీయ సమావేశాలు కాదు.. ఆత్మావలోకన సమావేశాలు: మంత్రి కందుల దుర్గేష్

వైసీపీవి ఆత్మీయ సమావేశాలు కాదు.. ఆత్మావలోకన సమావేశాలు: మంత్రి కందుల దుర్గేష్

Gaddamidi Naveen
23 జూన్, 2026

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహిస్తున్నవి "ఆత్మీయ సమావేశాలు" కావు అని, ఎన్నికల్లో ప్రజల తిరస్కారం, తమ రాజకీయ భవిష్యత్తుపై ఉన్న భయంతో చేసుకుంటున్న ఆత్మావలోకన సమావేశాలు మాత్రమేనని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎద్దేవా చేశారు.

మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల వైసీపీ పాలనలో కాపు కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని, విదేశీ విద్య పథకాలను నిలిపివేసి కాపు యువత భవిష్యత్తుతో చెలగాటమాడారని మండిపడ్డారు. అలాంటి నాయకులకు నేడు కాపు సమాజం గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. పిఠాపురం ప్రజలు ఘన విజయం అందించిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం వారి రాజకీయ నిరాశకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు అందరికీ ఉంటుందని, ప్రజల ఆశీర్వాదంతోనే పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయాన్ని సాధించారని గుర్తుచేశారు.

సామాన్య కార్యకర్తలను గౌరవించడమే జనసేన పార్టీ సిద్ధాంతమని మంత్రి తెలిపారు. దానికి నిదర్శనంగా.. ఒక సాధారణ కార్యకర్త అయిన కొట్టె సాయిని ఆదుకుని, నేడు ఆలయ చైర్మన్ స్థాయికి తీసుకువచ్చిన గొప్ప చరిత్ర జనసేన పార్టీదని కొనియాడారు. దేశం, సమాజం బాగుండాలి.. నన్ను కులాల చట్రంలో బంధించవద్దు అనే పవన్ కళ్యాణ్ ఉన్నత భావజాలాన్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని మంత్రి తెలిపారు. కులాల పేరుతో సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఇకపై సాగవని, ప్రజలు అన్ని నిజాలను గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాపు సమాజాన్ని వాడుకోవాలని చూస్తే ప్రజలే వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని కందుల దుర్గేష్ హెచ్చరించారు.

ట్యాగ్‌లు
KandulaDurgeshJanaSenaPawanKalyanYSRCPAndhraPradeshPoliticsPithapuramKapuCommunityAPPoliticsPoliticalNewsTeluguNews
వైసీపీవి ఆత్మీయ సమావేశాలు కాదు.. ఆత్మావలోకన సమావేశాలు: మంత్రి కందుల దుర్గేష్ - Tholi Paluku