Let's talk: editor@tmv.in
సిరిసిల్లలో ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్
సిరిసిల్లలో ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్

సిరిసిల్లలో ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్

Gaddamidi Naveen
14 జూన్, 2026

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల సుపరిపాలనను పురస్కరించుకుని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం ‘స్వచ్ఛ పాఠశాల’ (మన బడి - మన బాధ్యత) అనే విశిష్ట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి స్వయంగా పాల్గొని స్కూల్ తరగతులను, ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకుంటున్న తరుణంలో విద్యార్థులకు శుభ్రమైన వాతావరణం కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఈ సేవలో మంత్రి బండి సంజయ్‌తో పాటు బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాఠశాల విద్యా కమిటీల నాయకులు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని స్కూల్ గదులను పరిశుభ్రం చేశారు. విద్యాభివృద్ధితో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు.