Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో ‘టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో - 2026’ ప్రారంభం
హైదరాబాద్‌లో ‘టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో - 2026’ ప్రారంభం

హైదరాబాద్‌లో ‘టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో - 2026’ ప్రారంభం

Gaddamidi Naveen
19 ఏప్రిల్, 2026

హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "టైమ్స్ ప్రాపర్టీ ఎక్స్‌పో - 2026" (6వ ఎడిషన్) శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనను ప్రారంభించారు.

ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎక్స్‌పోలోని వివిధ స్టాళ్లను సందర్శించారు. బిల్డర్లు, డెవలపర్లతో మాట్లాడి ప్రదర్శనలో ఉన్న విభిన్న ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే, గృహ కొనుగోలుదారులతో ముచ్చటించి వారి ఆకాంక్షలను, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని, దేశంలోనే హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి కేంద్రంగా మారిందని మంత్రి కొనియాడారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కోసం ఇప్పటికే రూ.40,000 కోట్లకు పైగా కేటాయించామని, రోడ్లు & భవనాల శాఖ ద్వారా సుమారు రూ. 70,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్, గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం వల్ల నగర కనెక్టివిటీ అద్భుతంగా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, నగర విస్తరణకు కొత్త మార్గాలు సుగమమవుతాయని, ఇది రియల్ ఎస్టేట్ రంగానికి బలమైన పునాదిగా నిలుస్తుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ సాయి ధర్మ, బ్రాంచ్ హెడ్ మనోజ్ యాదవ్, అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ మార్కెటింగ్ హెడ్ వెంకట్ రావు, మై హోమ్ మార్కెటింగ్ హెడ్ నవీన్ రెడ్డి, బ్రిక్స్ ఇన్‌ఫ్రా ఎమ్‌డీ మీరా రవీందర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఎక్స్‌పో ఒకే వేదికపై అనేక రకాల ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చింది.