Let's talk: editor@tmv.in
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: ఎమ్మెల్యే పులివర్తి నాని

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: ఎమ్మెల్యే పులివర్తి నాని

Gaddamidi Naveen
30 జూన్, 2026

ఏరువాక పౌర్ణమి సంద‌ర్భంగా రైతు సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి పునాదని, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్రం అభివృద్ధి చెందితే ప్రజాప్రతినిధులుగా తాము కూడా సంతృప్తిగా పని చేయగలమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆచరణాత్మక నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

నియోజకవర్గంలోని సుమారు 26 వేల మంది మామిడి రైతులకు రూ.17 కోట్ల మేర ఆర్థిక లబ్ధి అందడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జూమ్ కాన్ఫరెన్స్‌ల పేరుతో అధికారులను ఇళ్లకు పిలిపించి మానసికంగా వేధించారని ఆరోపించారు. చెరువుల నీటి అనుసంధానం ద్వారా నీటి కొరతను నివారించి, రైతులు ఏడాది పొడవునా పంటలు సాగు చేసే అవకాశం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొలంలో దిగి, రైతులతో కలిసి నాగలితో దున్ని, వ్యవసాయ పనులను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు.

ట్యాగ్‌లు
AndhraPradeshFarmersFarmerWelfareMangoFarmersAgricultureChandragiriRuralDevelopment
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: ఎమ్మెల్యే పులివర్తి నాని - Tholi Paluku