Let's talk: editor@tmv.in
వేసవిలో ప్రతి ఇంటికి తాగునీరు చేర్చడమే లక్ష్యం: వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

వేసవిలో ప్రతి ఇంటికి తాగునీరు చేర్చడమే లక్ష్యం: వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Panthagani Anusha
26 ఏప్రిల్, 2026

వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా పని చేయాలని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. జలమే జీవధారం వేసవిలో ప్రతి ఇంటికి తాగునీరు చేరేలా చర్యలు తీసుకోవాలి అని ఆమె పేర్కొన్నారు.

నెల్లూరు నగరంలోని మాగుంట అవుట్‌లో ఉన్న క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని తహసీల్దారులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న స్పెషల్ ఆఫీసర్లతో స్థానిక సమస్యలపై ఆమె ప్రత్యేకంగా చర్చించారు.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు. పైపుల లీకేజీలను వెంటనే నియంత్రించడం పనిచేయని బోర్లు, మోటార్లను మరమ్మత్తు చేయడం అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిర్వహించడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అదేవిదంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ముఖ్యంగా ఓవర్ హెడ్ ట్యాంకుల శుభ్రతను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. తాగునీటి నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అదేవిధంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం పెంచాలని అందుబాటులో ఉన్న నిధులను తాగునీటి అవసరాలకే వినియోగించాలని ఆమె ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను పెంచి, నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.