
తీరం మనదే.. సంపదా మనదే: కావలి సభలో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ సముద్ర తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులకు పూర్తి భాగస్వామ్యం కల్పిస్తామని వారి హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో మంగళవారం నిర్వహించిన ‘మత్స్యకారుల సేవలో’ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేట నిషేధ కాల భృతిని గతంలో ఉన్న రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ. 261.50 కోట్ల ఆర్థిక సహాయాన్ని సీఎం బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశారు.
సందర్భంగా సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ. “ఈ తీరం మనది, బోటూ మనదే ఇక్కడి సంపద కూడా మనదే. మన జలాల్లోకి పొరుగు రాష్ట్రాల బోట్లు వస్తే సహించేది లేదు అని తేల్చిచెప్పారు. సముద్రంలో స్థానిక మత్స్యకారుల రక్షణ నిఘా కోసం ‘జాయింట్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఫర్ సీ పెట్రోలింగ్’ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మెరైన్ పోలీస్, మత్స్య, అటవీ శాఖలతో పాటు స్థానిక మత్స్యకారులను ఇందులో భాగస్వాములను చేసినట్లు తెలిపారు. శాటిలైట్ చిత్రాలు, అధునాతన డ్రోన్ల ద్వారా సముద్ర సరిహద్దుల్లో నిఘా పెడుతున్నామని ఇతర భాషల్లో హెచ్చరికలు జారీ చేసే సాంకేతికతను వినియోగిస్తున్నామని వివరించారు. మత్స్యకారుల భద్రత కోసం సముద్రంలో 4,550 ట్రాన్స్‌పాండర్లను ఏర్పాటు చేసి జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు.
సీవీడ్ సాగుతో మహిళలకు అదనపు ఆదాయం
మత్స్యకార కుటుంబాల్లోని మహిళల ఆర్థిక సాధికారత కోసం ‘సీవీడ్’ (సముద్రపు నాచు) సాగును ప్రోత్సహిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘సీఎస్ఎంసీఆర్ఐ’ సహకారంతో మత్స్యకార మహిళలకు డ్వాక్రా సంఘాలకు ఈ సాగులో ప్రత్యేక శిక్షణతో పాటు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. అదేవిధంగా మత్స్యకారుల వేటను సులభతరం చేసేందుకు 60 శాతం సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లను మంజూరు చేస్తున్నామని, మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ రుణంగా అందిస్తామని వెల్లడించారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకు లీటరుకు రూ. 9 చొప్పున డీజిల్ సబ్సిడీ ఇస్తున్నామని 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 50 కోట్ల విలువైన సబ్సిడీని అందించామని సీఎం పేర్కొన్నారు.
మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ మేనేజర్‌గా వ్యవహరిస్తా
రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులలో చేపల పెంపకం చేపట్టి వాటిని విక్రయించుకునే పూర్తి హక్కులను మత్స్యకారులకే అప్పగించామని చంద్రబాబు స్పష్టం చేశారు. జలవనరుల్లో ఉచితంగా ‘ఫిష్ సీడ్’ అందించాలని మత్స్యశాఖను ఆదేశించామన్నారు. రూ.3,256 కోట్లతో రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని అందులో భాగంగా కావలి ప్రాంతంలో రూ.288 కోట్లతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నామని తెలిపారు. కావలిలోనే ‘సాగర్ డిఫెన్స్’ సంస్థ
