Let's talk: editor@tmv.in
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

Gaddamidi Naveen
3 మే, 2026

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి మే 13 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. మొదటి, రెండో సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులతో పాటు, ఫెయిల్ అయిన జనరల్, వొకేషనల్ అభ్యర్థులందరికీ ఈ అవకాశం కల్పించారు.

తాజా ఉత్తర్వుల ప్రకారం, విద్యార్థులు రూ.3,000 ఆలస్య రుసుముతో తమ ఫీజును చెల్లించవచ్చు. ఈ పొడిగించిన గడువు మే 4 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. నిర్ణీత గడువు తర్వాత ఎలాంటి దరఖాస్తులు స్వీకరించబడవని అధికారులు స్పష్టం చేశారు. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలను నిర్వహించనున్నారు.