Let's talk: editor@tmv.in
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా

Gaddamidi Naveen
23 జూన్, 2026

తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సోమవారం తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న ఆయన.. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక పర్యటనలో గవర్నర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

ఈ దర్శనానికి సంబంధించిన వివరాలను తెలంగాణ గవర్నర్ కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకుంది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఆయన స్వామివారిని దర్శించుకుని, ఆ సర్వేశ్వరుని దివ్య ఆశీస్సులు పొందారని లోక్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. శేషాచలం కొండల్లోని ఏడో శిఖరంపై వెలిసిన ఈ శతాబ్దాల నాటి తిరుమల క్షేత్రం.. దేశ విదేశాల నుంచి ప్రతి ఏటా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తూ అత్యంత ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.

ఆదిత్య మెహతా ఫౌండేషన్ వేడుకల్లో గవర్నర్

ఇదిలావుండగా, జూన్ 4వ తేదీన హైదరాబాద్ రసూల్‌పురాలో ఆదిత్య మెహతా ఫౌండేషన్ నిర్వహించిన 14వ ప్రెజెంటేషన్ అండ్ ఫెలిసిటేషన్ వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడలు, శిక్షణ, పునరావాసం ద్వారా దివ్యాంగుల సాధికారత కోసం ఈ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఆయన ఎంతగానో అభినందించారు. ఈ సందర్భంగా పారా-అథ్లెట్లతో మాట్లాడిన‌ గవర్నర్, వారికి అందుతున్న శిక్షణ సౌకర్యాలను పరిశీలించారు. క్షేత్రస్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.

ట్యాగ్‌లు
TelanganaGovernorShivPratapShuklaTirumalaTirupatiTirumalaTempleSriVenkateswaraSwamyLordVenkateswaraBalajiTempleSuprabhataSeva
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా - Tholi Paluku