Let's talk: editor@tmv.in
ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నిలిపితే కఠిన చర్యలు: వీసీ సజ్జనార్

ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నిలిపితే కఠిన చర్యలు: వీసీ సజ్జనార్

Panthagani Anusha
4 మే, 2026

నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఇటీవల చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ : వీసీ సజ్జనార్ సూచించారు. బ్రేక్‌డౌన్ వంటి అత్యవసర పరిస్థితులు తప్ప, ఓఆర్ఆర్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలను నిలపవద్దని ఆయన స్పష్టం చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో వాహనాన్ని ఆపాల్సి వచ్చినప్పుడు వెంటనే 14449 హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని తగిన భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే వాహనాన్ని ఎడమ వైపు చివరి లేన్‌లో నిలపాలని సూచించారు. ఈ నియమాలు కేవలం ఓఆర్ఆర్‌కే పరిమితం కావని, అన్ని జాతీయ రహదారులపై కూడా తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.

సంస్థలు తమ డ్రైవర్లు, సిబ్బందికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రజలు పోలీసులకు సహకరించాలని, నిబంధనలు అతిక్రమించి వాహనాలు నిలిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.