
ముఖ్యమంత్రిని కలిసిన రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్
Gaddamidi Naveen
2 మే, 2026
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్, రాష్ట్ర భద్రతా వ్యవహారాల సలహాదారుగా నియమితులైన బి. శివధర్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఈ సమావేశం జరిగింది.
వీరితో పాటు ఇటీవలే బదిలీపై వివిధ కీలక పదవులను చేపట్టిన పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఐపీఎస్ అధికారులు శిఖా గోయల్, డీఎస్ చౌహన్, షానవాజ్ ఖాసీం, తరుణ్ జోషి, బి. సుమతి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసు యంత్రాంగం బలోపేతంపై చర్చలు జరిగినట్లు సమాచారం. అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు.
