Let's talk: editor@tmv.in
హేట్ స్పీచ్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా మంత్రి పొన్నం ప్రభాకర్

హేట్ స్పీచ్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా మంత్రి పొన్నం ప్రభాకర్

Gaddamidi Naveen
8 జులై, 2026

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు-2026పై పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీని నియమించారు. ఈ ఏడాది మార్చి 30న అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం మేరకు కమిటీని ఏర్పాటు చేసినట్లు అసెంబ్లీ బులెటిన్‌లో వెల్లడించారు.

ఈ కమిటీకి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను చైర్మన్‌గా నియమించారు. సభ్యులుగా కాంగ్రెస్‌కు చెందిన ఎన్. బాలు నాయక్, లక్ష్మీకాంతరావు తోట, జి. మధుసూదన్ రెడ్డి, కె. రాజేష్ రెడ్డి, ఎం. యశస్విని, దానం నాగేందర్, బీఆర్ఎస్‌కు చెందిన కోవ లక్ష్మి, కె. మాణిక్ రావు, బీజేపీకి చెందిన రామారావు పవార్, ఎంఐఎంకు చెందిన అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, సీపీఐకి చెందిన కూనంనేని సాంబశివరావు సభ్యులుగా ఉన్నారు.

వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ముగింపు నాటికి ఈ కమిటీ తన నివేదికను సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు. ఇదే సందర్భంగా 2026-27 సంవత్సరానికి సంబంధించిన సంక్షేమ కమిటీలు, ఇతర సంయుక్త కమిటీలు, శాసనసభ-శాసన మండలి కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్లు అసెంబ్లీ బులెటిన్‌లో పేర్కొన్నారు.

ట్యాగ్‌లు
TelanganaTelanganaAssemblyHateSpeechBillHateCrimesSelectCommitteePonnamPrabhakarAssemblyNewsHyderabadTelanganaPoliticsPoliticalNews
హేట్ స్పీచ్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా మంత్రి పొన్నం ప్రభాకర్ - Tholi Paluku