Let's talk: editor@tmv.in
రేపు రెండో విడత ‘రైతు భరోసా’ నిధుల విడుదల

రేపు రెండో విడత ‘రైతు భరోసా’ నిధుల విడుదల

Gaddamidi Naveen
19 ఏప్రిల్, 2026

తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. 'రైతు భరోసా' పథకం రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఏప్రిల్ 20న‌, సోమవారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వీటిని విడుదల చేయనున్నారు.

రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45.12 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రైతులకు రూ.5,653 కోట్ల నిధులు జమ కానున్నాయి. వీరికి ప్రతి ఎకరానికి రూ. 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందనుంది. మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో జరిగిన బహిరంగ సభలో తొలి విడతగా 1.50 కోట్ల ఎకరాలకు రూ.3,590 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ పనుల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు ఈ నిధులు ఎంతో ఊరటనిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.