
జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సంజయ్ ఝా
జనతాదళ్ (యునైటెడ్) జాతీయ కార్యవర్గాన్ని పార్టీ అధినేత నితీశ్ కుమార్ పునర్వ్యవస్థీకరించారు. రాజ్యసభ సభ్యుడు సంజయ్ కుమార్ ఝాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగిస్తూ, మాజీ ఎంపీ చంద్రేశ్వర్ ప్రసాద్ చంద్రవంశీని వైస్ ప్రెసిడెంట్‌గా నియమించారు. డా. ఆలోక్ కుమార్ సుమన్ ట్రెజరర్‌గా కొనసాగనున్నారు. జాతీయ స్థాయిలో సంస్థాగత బలం పెంచడమే ఈ మార్పుల లక్ష్యమని పార్టీ ప్రకటనలో తెలిపింది. పలువురు నేతలను జనరల్ సెక్రటరీలు, సెక్రటరీలుగా నియమించింది.
జనరల్ సెక్రటరీలు
మనీష్ కుమార్ వర్మ, అఫాక్ అహ్మద్ ఖాన్, శ్యామ్ రాజక్, అశోక్ చౌదరీ, రమేష్ సింగ్ కుష్వాహా, రామ్ సేవక్ సింగ్, కహ్కేశాన్ పర్వీన్, కపిల్ హరిశ్చంద్ర పాటిల్, రాజ్ సింగ్ మాన్, సునీల్ కుమార్ (ఇంజనీర్ సునీల్), హర్షవర్ధన్ సింగ్, మౌలానా గులామ్ రసూల్ బాలియావీ తదితరులు.
నిశాంత్‌కు దక్కని చోటు
రాజీవ్ రంజన్ ప్రసాద్, రబీందర్ ప్రసాద్ సింగ్, విద్యాసాగర్ నిషాద్, దయానంద్ రాయ్, సంజయ్ కుమార్, మొహమ్మద్ నిసార్, రుహీ టాగుంగ్, నివేదితా కుమారి తదితరులను సెక్రటరీలుగా నియమించారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇటీవలే పార్టీలో చేరిన నితీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ పేరు ఈ జాబితాలో లేకపోవడం. పార్టీ శ్రేణులు ఆయనకు కీలక బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇటీవలే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పార్లమెంటుకు ఎన్నికైన నితీశ్ కుమార్, ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించి పార్టీపై తన పట్టు యథాతథంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు.
